ఉత్తర ప్రదేశ్‌లో దారుణం.. ప్రియుడితో వెళ్లిపోయిందని…కుమార్తెను రేప్‌ చేసిన తండ్రి, సోదరుడు!

ముజఫర్‌నగర్‌ ముచ్చట్లు :

ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ప్రియుడితో వెళ్లిపోయిన కుమార్తెపై ఆమె తండ్రి, సోదరుడు సహా నలుగురు కుటుంబ సభ్యులు అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులందరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ధనేడా గ్రామంలో ఈ ఘటన జరిగినట్లు పేర్కొన్నారు. కొన్ని నెలల క్రితం ప్రియుడితో ఆమె వె ళ్లిపోయిందని, ఆమెను పట్టుకున్న కుటుంబ సభ్యులు బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు వివరించారు. అలహాబాద్‌ హైకోర్టు ఆదేశాల మేరకు సోమవారం నిందితులపై కేసు నమోదు చేశామని మంగళవారం అదుపులోనికి తీసుకున్నట్లు స్టేషన్‌హౌస్‌ ఆఫీసర్‌ (ఎస్‌హెచ్‌వో) కుషాల్‌ పాల్‌ సింగ్‌ తెలిపారు. తనను ఇంటిలో నిర్భంధించి అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. బాధితురాలిని మేజిస్ట్రేట్‌ ఎదుట ప్రవేశపెట్టగా ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

 

Tag   : In Uttar Pradesh


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *