బోధన్‌ బల్దియాకు పెరిగిన ఆదాయం

Date:13/03/2018
నిజామాబాద్ ముచ్చట్లు:
నిజామాబాద్ జిల్లా బోధన్‌ మున్సిపాలిటీకి ఇటీవలిగా ఆదాయం పెరిగింది.  రోజుకో భవన నిర్మాణ అనుమతి జారీ అవడమే దీనికి కారణంగా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. గతేడాది అంటే 2017-18 ఆర్థిక సంవత్సరంలో మార్చి 7 నాటికి 250 భవనాలు నిర్మించుకోవడానికి అనుమతిచ్చారు. దీంతో బల్దియా ఈ ఆర్థిక సంవత్సరం ముగియకముందే రూ. 78లక్షల ఆదాయాన్ని కైవసం చేసుకుంది. మార్చి 31 వరకు మరో పదికి పైగా దరఖాస్తులకు అనుమతులిచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అంటే ఏడాదిలో సెలవులు మినహాయించి పనిదినాలు లెక్కిస్తే సగటున రోజుకో అనుమతి మంజూరు చేసినట్లే అని స్థానికులు చెప్తున్నారు. ఏడాదిన్నర కాలంగా బోధన్‌ బల్దియాలో ఆన్‌లైన్‌లోనే నిర్మాణ అనుమతులు ఇస్తున్నారు. ఈ పద్ధతిన పట్టణంలో ఒక ఆర్థిక సంవత్సరంలో మాత్రం 250 వరకు దరఖాస్తులకు అనుమతులు మంజూరు చేశారు. ఎక్కువ శాతం దరఖాస్తులను 21 రోజుల కాలవధిలోగానే పరిష్కరించారు. ఈ విషయాన్ని అధికారులే స్వయంగా వెల్లడించారు. పట్టణ ప్రణాళిక విభాగంలో ఆన్‌లైన్‌ విధానం వచ్చిన తర్వాత జవాబుదారీతనం పెరిగిందని చెప్తున్నారు.
Tags: Increased earnings for Bodhan Baltiya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *