మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ కు భద్రత పెంపు.

హైదరాబాద్‌ ముచ్చట్లు:
మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు భద్రత పెంచాలని ఇంటెలిజెన్స్‌ విభాగం నిర్ణయించింది. ఇటీవల హత్య కుట్రకోణం బయట పడటంతో ఆయనకు భద్రత పెంచాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా రెండు పైలట్‌ వాహనాలు, 20 మందితో భద్రత కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు ఒక పైలట్‌ సహా పది మంది సెక్యూరిటీ ఉండేవారు. ప్రస్తుతం మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఆయన హైదరాబాద్‌ వచ్చిన తర్వాత అదనపు భద్రతా సిబ్బంది విధుల్లో చేరనున్నారు.
 
Tags:Increased security for Minister Srinivas Gowda

Natyam ad