ధర్మనాయక్ హత్య వెనుక రెండో భార్య

Date14/02/2018
వరంగల్ ముచ్చట్లు:
నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలం చింతలపాలెం ఉప సర్పంచ్ ధర్మానాయక్  హత్య వెనుక అతడి రెండో భార్య శిరీష హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. వివాహేతర సంబంధం పెట్టుకున్న శిరీష అందుకు తన భర్త అడ్డుగా ఉన్నాడని భావించి, ప్రియుడి సాయంతో కడతేర్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నల్లగొండ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ లక్ష్మీ భర్త, కాంగ్రెస్‌ నేత బొడ్డుపల్లి శ్రీనివాస్‌ హత్యోదంతం మరవక ముందే.. అదే పార్టీకి చెందిన మరో నేత హత్యకు గురవడం జిల్లాలో తీవ్ర కలకలం రేపింది.చింతలపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని నాగార్జునపేట తండాకు చెందిన ధర్మానాయక్‌కు జమ్మన్‌కోటకు చెందిన సావిత్రితో 20 ఏళ్ల కిందట వివాహమైంది. సావిత్రికి సంతానం కలగకపోవడంతో పదేళ్ల కిందట ఆమె చెల్లెలు శిరీషను ధర్మానాయక్ రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు.అయితే.. శిరీష తన భర్త కళ్లుగప్పి కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన రవినాయక్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన వారిద్దరూ ధర్మానాయక్‌ను అంతం చేయడానికి పథకం వేశారు. సోమవారం  రాత్రి ధర్మానాయక్ మొదటి భార్య సావిత్రి.. శిరీష పెద్దకూతురును వెంటబెట్టుకొని పంటచేనుకు నీరు పెట్టడానికి వెళ్లింది. ధర్మానాయక్ తన కుమారుడితో కలిసి ఇంటి ఆవరణలో మంచంపై పడుకున్నాడు. శిరీష తన చిన్నకూతురుతో కలిసి ఇంటి లోపల నిద్రించింది.అర్ధరాత్రి సమయంలో భర్త వద్ద పడుకున్న కుమారుణ్ని ఇంట్లోకి తీసుకెళ్లిన శిరీష.. పథకం ప్రకారం ప్రియుడు రవితో కలిసి ధర్మానాయక్ మంచం కింద నాటు బాంబు అమర్చింది. బాంబు పేలుడులో ధర్మానాయక్ అక్కడికక్కడే మరణించాడు. అతడి శరీర భాగాలు చెల్లాచెదురుగా పడ్డాయి.
Tags: India is the number one after 2013

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *