2013 తర్వాత నెంబర్ వన్ గా ఇండియ 

Date:14/02/2018
ముంబై ముచ్చట్లు:
సఫారీ గడ్డ మీద తొలిసారి వన్డే సిరీస్ విజయాన్ని సొంతం చేసుకున్న భారత జట్టుకు మరో శుభవార్త. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా అగ్రస్థానం పదిలమైంది. పోర్ట్ ఎలిజబెత్ వన్డేలో గెలిచిన కోహ్లి సేన… చివరి మ్యాచ్‌లో ఓడిన నంబర్ 1 హోదాలో కొనసాగనుంది. ఆరు వన్డేల సిరీస్ ఆరంభానికి ముందు భారత జట్టు ఖాతాలో 119 పాయింట్లు ఉండగా… 4-1 ఆధిక్యం సాధించాక… 122 పాయింట్లు చేరాయి. మొదటి రెండు మ్యాచ్‌లు గెలిచాక భారత్ అగ్రస్థానానికి చేరుకుంది. కానీ మరో రెండు మ్యాచ్‌ల్లో నెగ్గడం ద్వారా తన స్థానాన్ని పదిలం చేసుకుంది.నంబర్ 1 జట్టుగా వన్డే సిరీస్ ప్రారంభించిన సౌతాఫ్రికా జట్టు రెండో స్థానానికి పరిమితమైంది. ప్రస్తుతం ఆ జట్టు ఖాతాలో 118 పాయింట్లు ఉన్నాయి. చివరి వన్డేలోనూ భారత్ నెగ్గితే అగ్రస్థానం మరింత పదిలం అవుతుంది. టీమిండియా టెస్టుల్లోనూ నంబర్ 1 హోదాలో ఉన్న సంగతి తెలిసిందే.ఓవరాల్‌గా భారత జట్టు వన్డేల్లో అగ్రస్థానానికి చేరుకోవడం ఇది ఐదోసారి కాగా.. గతేడాది అక్టోబర్ తర్వాత ఇదే తొలిసారి. టీమిండియా మొదటిసారి 2013లో వన్డేల్లో నంబర్ 1 జట్టుగా నిలిచింది.
Tags: India is the number one after 2013

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *