ఇన్నింగ్స్ 239 పరుగుల తేడాతో ఇండియా విజయం

నాగ్పూర్ ముచ్చట్లు:

ఊహించినట్లే రెండో టెస్ట్లో శ్రీలంకపై ఇన్నింగ్స్ 239 పరుగుల భారీ స్కోరుతో టీమిండియా ఘన విజయం సాధించింది. టెస్టుల్లో ఇండియాకు ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం. గతంలో 2007లో బంగ్లాదేశ్పై కూడా సరిగ్గా ఇన్నింగ్స్ 239 పరుగుల తేడాతోనే ఇండియా గెలిచింది. నాలుగో రోజు లంచ్ తర్వాత కాసేపటికే లంక రెండో ఇన్నింగ్స్లో 166 పరుగులకు కుప్పకూలింది. అశ్విన్ 4, ఇషాంత్, జడేజా, ఉమేష్ తలా 2 వికెట్లు తీసుకున్నారు. చివరి వికెట్ తీసి టీమిండియాను గెలిపించిన అశ్విన్.. టెస్ట్ క్రికెట్లో అత్యంత వేగంగా 300 వికెట్ల మైలురాయిని అందుకున్న బౌలర్గా రికార్డు సృష్టించాడు. ఈ విజయంతో 3 టెస్ట్ల సిరీస్లో కోహ్లి సేన 1-0 లీడ్లో నిలిచింది.తొలి ఇన్నింగ్స్లో శ్రీలంక 205 పరుగులు చేయగా.. భారత్ 6 వికెట్లకు 610 పరుగుల భారీ స్కోరు దగ్గర డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే. కోహ్లి (213) డబుల్ సెంచరీ చేయగా.. విజయ్, పుజారా, రోహిత్ సెంచరీలు చేశారు.కెరీర్లో ఐదో డబుల్ సెంచరీ చేసిన విరాట్ కోహ్లికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

 

Tag : India won by an innings and 239 runs


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *