Indian assassins murder in America

అమెరికాలో భారతీయుడి దారుణ హత్య..!

Date:12/01/2018

అమెరికా ముచ్చట్లు:

అమెరికాలో మరోసారి భారతీయులపై దాడి జరిగింది. ఇద్దరు భారతీయుల్ని దారుణంగా కాల్చి చంపేశారు. ఒక సూపర్ మార్కెట్ లోకి చొరబడిన దోపిడీ దొంగలు, అక్కడ ఉన్న ఇద్దరు భారతీయుల్ని తుపాకీలు చూపించి, డబ్బు ఇమ్మని బెదిరించారు. అందుకు నిరాకరించడంతో ఇద్దరు భారతీయుల్ని కాల్చి చంపేశారు.దొంగలు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో గుజరాత్ కు చెందిన యువకుడు అర్షద్ అక్కడికక్కడే మృతిచెందగా, హైదరాబాద్ కు చెందిన సయ్యద్ బాఖర్ హుస్సేన్ శరీరంలోకి బుల్లెట్లు దూసుకుపోయాయి. అమెరికాలో ఇలా తీవ్రంగా గాయపడిన తమ తండ్రిని చూసేందుకు వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని బాధిత హైదరాబాదీ కుటుంబం వేడుకుంటోంది.
టోలిచౌక్ లోని గుల్షణ్ కాలనీకి చెందిన సయ్యద్ బాఖర్ హుస్సేన్, డాల్టన్ సిటీలోని గ్యాస్టియన్ పెట్రోల్ బంక్ సూపర్ మార్కెట్ లో ఉద్యోగం చేస్తున్నారు. 28వ తేదీన ఉదయం 11గంటల సమయంలో, ఒక్కసారిగా దోపిడీ దొంగలు సూపర్ మార్కెట్ లోకి తుపాకులతో చొరబడ్డారు. డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ సూపర్ మార్కెట్ యజమాని గుజరాత్ కు చెందిన వ్యక్తే.అతని కుమారుడు అర్షద్ వోరా పై కాల్పులు జరపగా, అతను అక్కడికక్కడే మరణించాడు. మరోవైపు, వారిని అడ్డుకోబోయిన హైదరాబాదీ బాఖర్ హుస్సేన్ పై రెండు రౌండ్ల కాల్పులు జరపగా, ఆయన ఛాతీలో, భుజంలో బుల్లెట్లు దూసుకుపోయాయి. తీవ్రంగా గాయపడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాఖర్ ను పోలీసులు హాస్పటల్ కు తరలించారు.అమెరికాలో ఉన్న భారతీయులకు రక్షణ లేకుండా పోతోందని, తమ తండ్రి వద్ద కుటుంబీకులు సైతం ఎవరూ లేరని, తమను ఎలాగైనా అమెరికా పంపించి, తండ్రి వద్దకు చేర్చాలని బాధితకుటుంబాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఇక కాల్పులు జరిపిన దుండగుల్ని పట్టుకుని, తగిన శిక్ష పడేలా చేయాలని, తమ తండ్రి ప్రాణాలు నిలబెట్టాలని కోరుకుంటున్నారు బాఖర్ కుటుంబసభ్యులు.

Tags : Indian assassins murder in America

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *