మైదానంలో భారత బౌలర్ షమి వాంతులు

దిల్లీముచ్చట్లు:
శ్రీలంకతో జరుగుతోన్న చివరి టెస్టులో ఇరు జట్ల బౌలర్లు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. కాలుష్య పొగ కారణంగా స్వల్ప అస్వస్థతకు గురైన భారత బౌలర్ మహమ్మద్ షమి మైదానంలో వాంతి చేసుకున్నాడు. 246/5 వద్ద కోహ్లీ సేన రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడంతో లంక బ్యాటింగ్కు దిగింది. ఆరో ఓవర్ వేసేందుకు షమి బంతిని అందుకున్నాడు. 5.5 వద్ద షమి వేసిన బంతిని ఎదుర్కొన్న సమరవిక్రమ(5).. రహానెకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాటపట్టాడు. ఆ తర్వాత షమి బౌలింగ్ వేసేందుకు వచ్చే క్రమంలో కాస్త ఇబ్బంది పడ్డాడు. మైదానంలోనే వాంతి చేసుకున్నాడు. అనంతరం కాస్త సర్దుకున్నాక ఆ ఓవర్లో మిగిలి ఉన్న ఒక్క బంతిని వేశాడు.7వ ఓవర్ అనంతరం షమి.. అంపైర్కు చెప్పి మైదానాన్ని వీడాడు. ఈ రోజు ఉదయం లంక బౌలర్ సురంగ లక్మల్ కూడా మైదానంలో వాంతి చేసుకున్నాడు. గత నాలుగు రోజులుగా దిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరిన సంగతి తెలిసిందే.
Tag: Indian bowler Shami vomiting on the field


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *