భారత రాజ్యాంగం ప్రజాస్వామ్య రాజ్యాంగం – రేణుకారెడ్డి

Date:26/01/2018

పలమనేరు ముచ్చట్లు:

భారతదేశ రాజ్యాంగం ప్రజాస్వామ్యబద్దమైన రాజ్యాంగమని రాష్ట్ర మంత్రి అమరనాథ్ రెడ్డి సతీమణి రేణుకారెడ్డి అన్నారు. రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజుని మనం ఘణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నామని ఆమె తెలిపారు. శుక్రవారం ఆమె స్థానిక తెదేపా కార్యాలయంలో భరత మాత చిత్రపటానికి పూలమావేసి,జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వచ్చిన సుమారు రూ. 15 లక్షల చెక్కులను ఆమె లబ్దిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెదేపా కోశాధికారి ఆర్వీబాలాజీ, మునిసిపల్ వైస్ చైర్మన్ చాంద్ భాషా, పలమనేరు ఏరియా ఆసుపత్రి కమిటీ చైర్మన్ బాలాజినాయుడు, జగదీష్ నాయుడు, కిషోర్ గౌడు, పెద్దపంజాణి ఎంపీపీ మురళీకృష్ణ, జెడ్పీటీసీ సులోచన, గీత, శమంతకమణి, ఖాజా, కుట్టి, కిషోర్, నవీన్ కుమార్, షాము, వెంకటమ్మ, సుబ్రమణ్యం, ఎలిజర్, ఎస్సీ సెల్ నాగరాజు, గిరిబాబు, తాతయ్యనాయుడు, వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.

Tags : Indian Constitution The Democratic Constitution – Renuka

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *