Indian cricketer Krishnamachari

భారతీయ క్రికెటర్ కృష్ణమాచారి

Date: 20/12/2017

అహ్మదాబాద్‌ ముచ్చట్లు:

కృష్ణమాచారి శ్రీకాంత్… 1959 డిసెంబర్ 21న తమిళనాడు రాజధాని చెన్నైలో జన్మించిన కృష్ణమాచారి శ్రీకాంత్ భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. 1981లో ఇంగ్లాండుపై అహ్మదాబాదులో తొలి వన్డే, ముంబాయిలో తొలి టెస్ట్ ఆడి అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రవేశించారు. 21 ఏళ్ళ వయసులోనే సునీల్ గవాస్కర్కు జతగా ఓపెనర్‌గా భారత జట్టు తరఫున ఆడిన రికార్డు ఆయన సొంతం. అయితే ఇద్దరికీ ఆట విధానమ్లో చాలా తేడా ఉన్నప్పటికీ శ్రీకాంత్ భారతీయ క్రికెట్ క్రీడలో తనదైన ముద్ర వేసుకున్నట్లు చరిత్ర స్పష్టంచేస్తోంది. గవాస్కర్ నైపుణ్యం కల బ్యాట్స్‌మెన్ కాగా శ్రీకాంత్ బ్యాటింగ్ హిట్టర్. తన హిట్టింగ్ ద్వారా ముఖ్యంగా వన్డేలలో భారత జట్టుకు మంచి శూభారంభం చేసేవాడు. గవాస్కర్, రవిశాస్త్రి, దిలీప్ వెంగ్‌సర్కార్, మోహిందర్ అమర్‌నాథ్ లాంటి నైపుణ్యం కల బ్యాట్స్‌మెన్ల కాలంలోనూ జట్టులో హిట్టర్‌గా నిలదొక్కున్నాడంటే అతని ప్రతిభను ప్రశంసించాల్సందే. అతని 43 టెస్టులకు ప్రాతినిధ్యం వహించి 2062 పరుగులు చేసారు.

Tag: Indian cricketer Krishnamachari

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *