India's second prime minister dies today

భారత రెండవ ప్రధాని వర్ధంతి నేడు…

Date: 09/01/2018

హైదరాబాద్‌ ముచ్చట్లు:

లాల్‌ బహాదుర్‌ శాస్త్రి… భారతదేశ రెండవ శాశ్వత ప్రధానమంత్రి, దేశ స్వాతంత్య్రోద్యమంలో ప్రముఖ పాత్రధారి. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని మొగల్‌ సరాయ్‌ గ్రామంలో లాల్‌ బహదూర్‌ 1904 అక్టోబర్‌ 2న శారదా ప్రసాద్‌, రామ్‌దులారీ దేవీలకు జన్మించాడు. తండ్రి శారదాప్రసాద్‌ రాయ్‌ ఒక నిరుపేద. బతకలేక బడిపంతులు అని అనుకుంటున్న ఆ రోజుల్లో ఆయన బడిపంతులు వృత్తిని చేపట్టి అతికష్టంగా తన కుటుంబాన్ని పోషిస్తూ కాలం గడిపేవాడు. ఇద్దరు ఆడపిల్లల తరువాత జన్మించిన లాల్‌ బహదూర్‌ను చూసుకొని ఆ తల్లిదండ్రులెంతో మురిసిపోయారు. బ్రిటీషు దాస్యశృంఖాలలో మగ్గిపోతున్న భారతదేశాన్ని స్వంతంత్రంగా చేయాలని అప్పటికే కృషి చేస్తున్న మహాత్మాగాంధీ జన్మదినమైన అక్టోబరు 2వ తారీఖునే, తమకు కుమారుడు కలగటం, ఆ దంపతులకు మరీ ఆనందం కలుగచేసింది.

Tags : India’s second prime minister dies today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *