అనంతలో  నీటికి కటకట

Date:13/04/2018
అనంతపురం ముచ్చట్లు:
అనంతపురం జిల్లాలో రెండేళ్ల కిందట తీవ్ర కరవు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఖరీఫ్‌ ఆరంభంలో వర్షాలు కురిసినా, ఆ తర్వాత వరుణుడి జాడలేక పంటలు ఎండిపోయాయి. ప్రభుత్వం జలఫిరంగుల ద్వారా పంటలను కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. ప్రధానంగా వేరుసెనగ పంట పూర్తిగా దెబ్బతింది. దీంతో చాలాచోట్ల పశుగ్రాసం కొరత ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో అధికారులు ఓ కొత్త ఆలోచనను తెరపైకి తీసుకొచ్చారు. చెరువుల్లో బోర్లు వేసి, తద్వారా స్థానిక రైతులతో సామూహిక పశుగ్రాస పెంపకాన్ని చేపట్టాలని నిర్ణయించుకున్నారు. అవసరమైన పశుగ్రాస విత్తును ఉచితంగా ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా పలు చెరువులను ఎంపిక చేశారు. ఆగమేఘాలపై ఆయా చెరువుల్లో బోర్లు తవ్వించారు. కొన్నిచోట్ల మాత్రమే నీరుపడ్డాయి. ఆ తర్వాత పశుగ్రాసం పెంపకం కూడా కొంతవరకు సఫలమైంది. మిగిలిన చోట్ల పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది.75 బోర్లు తవ్వగా వీటికి రూ.కోటికిపైగా వ్యయమైంది. గ్రామీణ నీటి సరఫరా శాఖ పరిధిలో బోర్లు తవ్వించారు. అధికారులు సొమ్ము చెల్లిస్తారన్న ధీమాతోనే యజమానులు బోర్లు వేశారు. ఆ తర్వాత చెల్లింపుల పంచాయితీ మొదలైంది. వాస్తవానికి పశుగ్రాసం పెంపకం నాలుగైదు శాఖల పరిధిలో చేపట్టారు. వీటిలో ఏదో ఒకశాఖ నిధులు చెల్లిస్తుందని అంతా భావించారు. ఈ మేరకు దస్త్రాన్ని నడిపారు. కానీ ఏ నిధుల కింద చెల్లింపులు జరపాలనేది మాత్రం తేల్చలేదు. పలువురు బోర్‌వెల్‌ యజమానులు సొమ్ము ఇవ్వాలంటూ అధికారులను కోరుతున్నారు. ఓ బోర్‌వెల్‌ యజమాని సగం బోర్లు తవ్వించినట్లు తెలుస్తోంది.
Tags:Inflammation of the water in infinity

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *