బొందిమడుగులలో జగనన్న సంపూర్ణ భూ హక్కు పథకం ప్రారంభం

తుగ్గలి ముచ్చట్లు:
 
మండల పరిధిలోని బొందిమడుగుల రెవెన్యూ పరిధిలో జగనన్న సంపూర్ణ భూ హక్కు మరియు భూరక్ష పథకాన్ని బొందిమడుగుల సర్పంచ్ ఎండా చౌడప్ప ప్రారంభించారు.మంగళవారం రోజున బొందిమడుగుల రెవెన్యూ పరిధిలో గల పొలిమేర కు పూజలు నిర్వహించి సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ భూ రీ సర్వే కార్యక్రమాన్ని రైతులు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలొ భాగంగా సచివాలయం సర్వేయర్ కృష్ణ నాయక్ మాట్లాడుతూ బొందిమడుగుల రెవెన్యూ పరిధిలోని సరిహద్దులను గుర్తించి, 20 మంది రైతులకు సంబంధించి భూ రి సర్వేను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వడ్డె నాగరాజు,చిన్న మాబు, ప్రతాప్,రమేష్,మోహన్, తలారి రాముడు తదితరులు పాల్గొన్నారు.
 
Tags: Initiation of Jagannath Absolute Land Rights Scheme in Bondimadugu

Natyam ad