రోడ్డు ప్రమాదంలో నవవధువులకు గాయాలు

విజయవాడ ముచ్చట్లు:
 
కృష్ణాజిల్లా గుడివాడ గుడ్లవల్లేరు మండలం కౌతవరంలో నవ జంటకు పెను ప్రమాదం తృటిలో  తప్పింది. గురువారం  రాత్రి కాకినాడలో పెళ్లి జంట ఆదిత్య, శ్రావణి  వివాహం ముగించుకొని కుటుంబ సభ్యులతో కలిసి మచిలీపట్నం వస్తున్నారు. కౌతవరం గ్రామం వద్ద మంచు కారణంగా రోడ్డు సరిగా కనపడక పెళ్లి కారు అదుపుతప్పి పక్కనే ఉన్న పంట కాల్వలో బోల్తా కొట్టింది. పెళ్లి జంట స్వల్ప గాయాలతో బయటపడింది. కారులో ఇతర కుటుంబ సభ్యులకు గాయాలు అయ్యాయి. కాళ్లపారాణి ఆరకముందే ప్రమాదం జరగడంతో కుటుంబసభ్యులు షాక్ కు గురైయారు. గాయపడినవారిని మచిలీపట్నం తరలించారు.
 
Tags; Injuries to newlyweds in road accident

Natyam ad