ఇన్నోవేషన్ హబ్ ఆఫ్ ఇండియా హైదరాబాద్: ఇవాంకా

హైదరాబాద్ ముచ్చట్లు:
వరల్డ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ (జీఈఎస్)లో భాగంగా మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు, సలహాదారు ఇవాంకా.. హైదరాబాద్‌పై ప్రశంసలు కురిపించారు. భాగ్యనగరాన్ని ఇన్నోవేషన్ హబ్ ఆఫ్ ఇండియాగా అభివర్ణించారు. ప్రపంచలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం ఇండియా అని, ఈ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన టీహబ్‌ను పొగడ్తల్లో ముంచెత్తారు. ఇది ఏషియాలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ హబ్ అని ఇవాంకా అన్నారు. హైదరాబాద్ మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ అని అన్నారు. ఇక ఇండియా స్పేస్‌క్రాఫ్ట్‌లు చంద్రున్ని, మార్స్‌ను తాకాయని ఈ సందర్భంగా ఇవాంకా చెప్పారు. ఇండియా తమకు స్ఫూర్తిగా నిలిచిందని తెలిపారు.ముత్యాల నగరం తొలిసారి ఆతిథ్యమిచ్చిన గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్ సమ్మిట్‌కు వచ్చిన 150 దేశాలకుపైగా ప్రతినిధులకు స్వాగతం పలికారు. ఇండియా, అమెరికా మధ్య బంధం బలోపేతమవుతున్నదని ఇవాంకా వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇండియాను నిజమైన స్నేహితుడిగా చెబుతారని ఆమె చెప్పారు.మహిళా సాధికారతే ప్రధాన లక్ష్యంగా ఈ ఏడాది సదస్సు జరుగుతున్నదని, ఈ సందర్భంగా మహిళా పారిశ్రామిక వేత్తలకు శుభాకాంక్షలు అని ఇవాంకా అన్నారు.

Tag : Innovation Hub of India Hyderabad: Ivanca


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *