పథకాలపై ఆరా …

– మూడవ రోజు పర్యటనలో వినూత్నంగా ఎంపీ మిధున్‌రెడ్డి
– పథకాలు అందాయా..లేదా..అని ప్రశ్నిస్తూ సాగిన పర్యటన
పుంగనూరు ముచ్చట్లు:
 
పుంగనూరు పట్టణంలో ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి పర్యటన మూడవ రోజు మరింత వినూత్నంగా సాగింది. రెండురోజుల పాటు ఇంటింటికి వెళ్లి సమస్యలను ఆలకించి , పరిష్కరించిన ఆయన… బుధవారం ప్రభుత్వ పథకాల అమలుతీరుపై ఆరా తీశారు. ఆటో డ్రైవర్‌, వీధి వ్యాపారులు, పెన్షన్లపై లబ్ధిదారుల మనోగతాన్ని తెలుసుకున్నారు.

లబ్ధిదారులతో ముఖాముఖి…
పట్టణంలోని ఆగర్తవీధిలో తోపుడు బండి వ్యాపారి నరసింహులు కూరగాయలు విక్రయిస్తుండగా ఎంపీ మిధున్‌రెడ్డి ఆయనతో మాట్లాడారు. జగనన్నతోడు డబ్బులు వచ్చిందా… అని అడిగారు. అయ్యా…డబ్బు వచ్చింది. నాకు ఇంటి పట్టా మంజూరు చేయాలని కోరారు. తక్షణమే ఇంటి పట్టా మంజూరు చేయిస్తామని , వివరాలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. అలాగే తూర్పుమొగశాల వద్ద ఆటో డ్రైవర్‌ రాజేంద్ర ను వాహనమిత్ర పథకంలో డబ్బు వచ్చిందా అని అడిగారు. ఆయన సంతోషంగా డబ్బు వచ్చిందని, అన్ని పథకాలు అందుతున్నాయని సంతోషంగా ఉన్నామని బదులు ఇచ్చారు. ఎంపీ అతనికి కరచాలనం చేసి , ఇంకను సమస్యలు ఉంటే తమకు తెలపాలని సూచించారు. అలాగే బెస్తవీధిలో చింతకాయ కొట్టి జీవించే లక్ష్మమ్మను రోజుకు ఎంత డబ్బు సంపాదిస్తున్నారని అడిగారు. ఆమె జీవనానికి సంపాదించుకుంటున్నానని, తనకు పెన్షన్‌ మంజూరుకాలేదని తెలపడంతో తక్షణమే పెన్షన్‌ మంజూరు చేయాలని కమిషనర్‌ను ఆదేశించారు. అలాగే కుమ్మరవీధిలో ప్రత్యేక ప్రతిభవంతుడు రషీద్‌ అనే బాలుడి కుటుంబ సభ్యులు పెన్షన్‌ పెంచాలని కోరారు. ప్రస్తుతం రూ.3 వేలు వస్తోందని తెలిపారు. దీనిని పరిశీలించి చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ను ఎంపీ ఆదేశించారు.
పర్యటన ఇలా…
 
రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిధున్‌రెడ్డి ఉదయం 8 గంటలకు వార్డుబాట కార్యక్రమం మూడవ రోజు ప్రారంభించారు. బ్రాహ్మణవీధిలో గల శ్రీషిరిడిసాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, పర్యటన ప్రారంభించారు. పట్టణంలోని మేవెంకటస్వామివీధి, కుమ్మరవీధి, బజారువీధి, తేరువీధి, సుబేదారువీధి, బ్రాహ్మణవీధి, షరాఫ్‌కట్‌వీధి, రాతిమసీదువీధి, నానబాలవీధి, ఉర్ధూస్కూల్‌వీధి, ఎంబిటి రోడ్డు, తాజ్‌నగర్‌, మంచాలవారివీధి, స్టాన్లీనగర్‌ ప్రాంతాలలో ఎంపీ పర్యటించి, ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. జెడ్పీ బాలికల హైస్కూల్‌ను సందర్శించి,విద్యార్థులు శ్రద్దగా చదువుకుని , ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. ఎంపీకి హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప, మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, ముడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి, రాష్ట్ర జానపద కళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, రాష్ట్ర కురబ సంఘ అధ్యక్షుడు జబ్బాల శ్రీనివాసులు, పార్టీ జిల్లా కార్యదర్శి ఫకృద్ధిన్‌షరీఫ్‌ పర్యటించారు.


రోడ్డు ప్రారంభం….
పట్టణంలోని బెస్తవీధిలో నూతనంగా వేసిన సిమెంటు రోడ్డును ఎంపీ మిధున్‌రెడ్డి ప్రారంభించారు. కౌన్సిలర్‌ కిజర్‌ఖాన్‌, రోడ్డు పని పూర్తి చేయించడంపై అభినందించారు. కౌన్సిలర్లు తమ వార్డులోని సమస్యలను దగ్గరుండి పరిష్కరించాలని సూచించారు.
కమ్యూనిటి భవనాలకు హామి….
పట్టణంలోని పలు కుల సంఘాలకు కమ్యూనిటి భవనాలు, ఇతర ఆర్థిక సహాయం అందిస్తామని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి హామి ఇచ్చారు. వార్డుబాటలో భాగంగా కుమ్మరవీధిలోని మదీనామసీదు పెద్దలు కమ్యూనిటి భవనము , రోడ్డు, మరుగుదొడ్లు కావాలని కోరారు. మంజూరు చేయిస్తామని ఎంపీ హామి ఇచ్చారు. అలాగే బ్రాహ్మణ సంఘ కార్యదర్శి రామకృష్ణ, డాక్టర్‌ రమణరావు కలసి కమ్యూనిటి భవనంతో పాటు స్మశానానికి రోడ్డు ఏర్పాటు చేయాలని కోరారు. మంజూరు చేస్తామన్నారు. అలాగే మెకానికల్‌ ద్విచక్రవాహన రిపేర్లకు అవసరమైన 80 జాకీలు అవసరమని కోరారు. పరిశీలించి అందజేస్తామని తెలిపారు. అలాగే ఉబేదుల్లా కాంపౌండులో గంగమ్మ గుడి నిర్మాణానికి విరాళం అందజేశారు.

   
Tags; Inquire about schemes …

Natyam ad