జర్మనీలో మధ్యంతర ఎన్నికలు? భాగస్వామ్య పక్షాలతో చర్చలు విఫలం

బెర్లిన్ ముచ్చట్లు:
జర్మనీ దిగువ సభ బుండెస్టాగ్కు సెప్టెంబరు 24న జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన మెజారిటీ రాకపోవడంతో మరలా ఆ దేశంలో ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. గత కొన్ని రోజులుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మోర్కెల్ వివిధ భాగస్వామ్య పక్షాలతో జరిపిన చర్చలు విఫలం అవడంతో ఈ పరిస్థితి నెలకొంది. మొత్తం 709 స్థానాలు ఉన్న బుండెస్టాగ్లో మోర్కెల్ పార్టీ అయిన క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్ ఆఫ్ జర్మనీ (సిడియు), తన భావజాలం ఉన్న సోదర పార్టీ అయిన క్రిస్టియన్ సోషల్ యూనియన్ (సిఎస్యు) తో కలసి 246 స్థానాలతో ప్రథమ స్థానంలో నిలవగా, సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ జపాన్ 153 స్థానాలు సాధించి ద్వితీయ స్థానంలో నిలిచింది.ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సాధారణ మెజారిటీ 355 సీట్లు కాగా, మోర్కెల్ ప్రభుత్వ ఏర్పాటు కోసం నాలుగు పార్టీలతో చర్చలు జరిపింది. వీటిలో ఒకటైన ప్రీ డెమోక్రటిక్ పార్టీ ఆదివారం చర్చల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. దీనితో మోర్కెల్ గతంలో తమతో కలసి సంకీర్ణ పక్షంగా ఉన్న సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ జపాన్ వైపు స్నేహహస్తం చాపింది. అయితే ఆ పార్టీ కూడా తాము ప్రతిపక్షంలోనే ఉంటామని, అధికార పక్షం వైపు రామని తేల్చి చెప్పింది.
దీనితో మోర్కెల్ గ్రీన్ పార్టీతో కలసి మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ కూటమి ఎక్కువ కాలం కొనసాగే అవకాశం లేదని విశ్లేషకులు అంటున్నారు. మోర్కెల్ వివిధ దేశాల నుంచి వచ్చే వలసదారులకు జర్మనీ ద్వారాలు తెరవడం, పర్యావరణ అంశాలలో ఆమె పార్టీ రాజీపడి పర్యావరణానికి ముప్పు కలిగే చర్యలు తీసుకోవడం వంటి కారణాల వల్ల సిడియుతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఏ పార్టీ ముందుకు రావడం లేదు. 2015-16లో జర్మనీ వివిధ దేశాల నుంచి వచ్చిన 12 లక్షల మంది వలసదారులను దేశంలోకి అనుమతించడంతో సెప్టెంబరులో జరిగిన ఎన్నికలలో ఆమె పార్టీకి 2013లో జరిగిన ఎన్నికలతో పోలిస్తే మెజారిటీ తగ్గింది.
అయితే వివిధ అంశాలలో భిన్నాభిప్రాయాలు ఉన్న తమతో కలసి వచ్చే భాగస్వామ్య పక్షాలతో ప్రభుత్వాన్ని ఏర్పరుస్తామని మోర్కెల్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Tag : Interim Elections in Germany


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *