మీర్ పేట పోలీస్ స్టేషన్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం.

రంగారెడ్డి ముచ్చట్లు:
 
రంగా రెడ్డి జిల్లా అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మీర్ పేట పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న మహిళలను బడంపేట్ నగర్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి ఘనంగా సన్మానించారు. మహిళలను అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఒక్క రోజే కాకుండా ప్రతిరోజూ గౌరవించాలని మీర్పేట్ సిఐ మహేందర్ రెడ్డి తెలిపారు. నేడు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని వారి అందిస్తున్న సేవలు మరువలేనివని అన్నారు. మహిళలు ఎక్కడైతే గౌరవించబడ్డాతరో అక్కడ సమాజం మొత్తం గౌరవించ బడుతుంది అని అన్నారు. ఫిర్యాదు చేయడానికి  స్టేషన్ కి వచ్చే మహిళల పట్ల గౌరవంగా  చూస్తావని అన్నారు. తెలంగాణలో షీ టైమ్స్ సేవలు మరిచి పోలేమని అన్నారు. మహిళా సిబ్బంది లో నూతన ఉత్సాహాన్ని సమాజంలో వారికి  ఉన్న గౌరవ ని తెలియడానికి కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు.
 
Tags:International Women’s Day at Mirpet Police Station.

Natyam ad