బ్రహ్మోత్సవాలకు టీటీడీ చైర్మన్ కు ఆహ్వానం

తిరుపతి  ముచ్చట్లు:
 
శ్రీనివాసమంగాపురం లోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారికి ఫిబ్రవరి 20 నుంచి 28వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని టీటీడీ చైర్మన్  వైవి సుబ్బారెడ్డిని శుక్రవారం అధికారులు ఆహ్వానించారు.
ఆలయ డిప్యూటి ఈవో  శాంతి, అర్చకులు  బాలాజి, సూపరింటెండెంట్  ముని చెంగలరాయులు తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో చైర్మన్ ను కలిసి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక అందించారు.
శివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం     నాగలాపురం మండలం సురుటుపల్లి లోని  శ్రీపల్లి కొండేశ్వర స్వామి వారికి ఫిబ్రవరి 21 నుంచి మార్చి 3వ తేదీ వరకు నిర్వహించే  శివరాత్రి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు టీటీడీ చైర్మన్ ను ఆహ్వానించారు. శుక్రవారం తిరుమల క్యాంపు కార్యాలయంలో వారు టీటీడీ చైర్మన్ ను కలసి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక అందించారు.ఆలయ అర్చకులు ఆశీర్వాదం చేశారు. ధర్మకర్తల మండలి సభ్యులు   గీతా నారాయణ, గీతా మురళీ రెడ్డి,  ప్రత్యేక ఆహ్వానితులు  బాలిరెడ్డి రాధాకృష్ణారెడ్డి హాజరయ్యారు.
 
Tags:Invitation to TTD Chairman for Brahmotsava

Natyam ad