ఏసీబీ వలలో ఇరిగేషన్ ఇంజినీర్లు

Date:14/03/2018
అనంతపురం  ముచ్చట్లు:
ఒకే ఆఫీసులో పక్క పక్క సీట్లు వారివి. ఇంకేం..ముడుపుల భాగోతం యాధేచ్చగా నడిపించవచ్చనుకున్నారు. కాని ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు.  అనంతపురం మైనర్ ఇరిగేషన్ క్వాలిటీ కంట్రోల్ కార్యాలయంపై బుధవారం ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. మద్యాహ్నం పూట ఒక కాంట్రక్టర్ నుంచి డీఈ వీరారెడ్డి రు. 20 వేలు, ఏఈ డాక్యా నాయక్ అలియాస్ శంకర్ నాయక్ రు. 26 వేలు తీసుకుంటూ పట్టబడ్డారు. బాధితుడు  శంకర్ రెడ్డి తరపున ఆదినారాయణ ఫిర్యాదుతో ఈ దాడులు జరిగాయి.  పెద్దవడుగూరు నీరు చెట్టు పథకం కింద రు. 18 లక్షల విలువైన పనులకు బిల్లులు మంజూరు కోసం లంచం డిమాండ్ చేసారు. దాంతో శంకర్ రెడ్డి ఏసీబీకి ఫిర్యాదు చేసాడు. దాంతో ఏసీబీ బృందం రంగంలోకి దిగింది. అనంతపురం లోని క్వాలిటీ కంట్రోల్ కార్యాలయం వద్ద శంకర్ రెడ్డి నుంచి  లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టబడ్డారు. ఈ దాడుల్లో ఏసీబీ డీఎస్పీ జయరామరాజు, సీఐలు ప్రతాపరెడ్డి, చక్రవర్తి, ఖాదర్ బాష పాల్గొన్నారు. ఆ ఇద్దరి అధికారుల ఇళ్లపై కూడా దాడులు నిర్వహిస్తున్నారు.
Tags: Irrigation Engineers in ACBs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *