Is it true that his father's 'surveillance' is not dominated by TRS?

తనయుడిపై తండ్రి ‘నిఘా’ తెరాసలో ఆధిపత్యపోరు నిజమేనా?

Date: 14/12/2017

హైదరాబాద్ ముచ్చట్లు:

కేటీఆర్ హంగామాకు కేసీఆర్ అడ్డుకట్ట!
గడిచిన రెండేళ్లలో గులాబీనేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తనయుడు, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు చేసిన హంగామా ఇంతా అంతా కాదు. వరంగల్ ఉప ఎన్నికల నుంచి ఖమ్మం పాలేరు ఎన్నికల వరకు అన్ని తానై నిలుస్తూ వచ్చారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఆయన సృష్టించిన ప్రభంజనంతో ఆయనకు మరో శాఖ వరించేలా చేసింది. గ్రేటర్ ఎన్నికల ప్రచార భాద్యతలు పూర్తిగా తన భుజస్కందాల మీద వేసుకుని తండ్రి తో శభాష్ అనిపించుకున్నారు. ఒకనోక దశలో కేసీఆర్ వారసత్వ నేతగా పేరు సంపాదించుకోవడమే కాకుండా కాబోయే సీఎం కేటీఆరే అనే స్థాయికి వెళ్లారు. అయితే తాజాగా ఆయన కేవలం కొంత వరకే పరిమితం చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయనకు తలకు మించిన భారం కావడంతో ఇక ఆయనను గ్రేటర్‌కే పరిమితం చేయాలని యోచించిన గులాబీనేత కేసీఆర్, జిల్లాల విషయంలో జోక్యం చేసుకునేందుకు ఇష్టపడటం లేదట! తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు హడావుడి కొద్ది రోజులుగా సాగుతున్న విషయం అందిరికి తెలిసిందే. దసరా నాటికి కొత్త జిల్లాల కసరత్తు పూర్తి చేయాలని భావిస్తున్న తెలంగాణ సర్కారు ఇందుకు అనుగుణంగా అడుగులు చకచకా పడుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కొత్త జిల్లాలు మండలాలపై తమ ప్రతిపాదన ముసాయిదాను సిద్దం చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ చేతికి ఇచ్చారు. ఈ నెల 22న ముసాయిదా నోటిఫికేషన విడుదల చేయాలని భావిస్తున్న తెలంగాణ సర్కార్ కొత్తగా 14 జిల్లాల్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కొత్తగా 13 జిల్లాలను ఏర్పాటు చేయాలని నిర్ణయిచినట్టుగా చెప్పినప్పటికీ ముసాయిదా ప్రతిని ముఖ్యమంత్రి చేతిలో పెట్టేసరికి 13 జిల్లాక కాస్తా 14 జిల్లాలుగా మరాయి. ఇదే సమయంలో ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి అయిన కేటీఆర్ అభీష్టం మేరకు సిరిసిల్లను జిల్లాగా చేయాలన్న ప్రతిపాదన విషయంలో ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారని చెప్పినా చివరకు అలాంటిదేమీ లేదని తేలింది. కేటీఆర్ కోరుకున్నట్లుగా కొత్త జిల్లా ఏర్పాటు సాధ్యం కాదని అధికారుల బృందం అభిప్రాయపడటం విపక్షాలు సైతం తీవ్రస్థాయిలో మండిపడుతున్న వేళ ఈ విషయంలో వెనక్కి తగ్గినట్లుగా చెబుతున్నారు. తాజాగా తయారుచేసిన ముసాయిదా తీర్మానంతో కొత్త జిల్లాలు 14 గా నిర్ణయించడంతో తెలంగాణలో మొత్తం 24 జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. సిరిసిల్లకు తుది జాబితాలో స్థానం దక్కకుంటే అనూహ్యంగా జాబితాలోకి నిర్మల్ రావడం గమనించదగ్గ విషయమే. తాను గూగుల్ మ్యాప్‌ను పరిశీలించినప్పుడు నిర్మల్ జిల్లా ఏర్పాటు అవసరాన్ని గుర్తించానని ముఖ్యమంత్రి చెప్పినట్లుగా చెబుతున్నారు. ముందుగా నిర్మల్ జిల్లాగా ప్రతిపాదన లేనప్పటికీ సీఎం కేసీఆర్ గూగుల్‌లో పరిశీలించిన అంనంతరం నిర్మల్ జిల్లాగా ఏర్పాటు చేయాల్సిన అవరసరాన్ని గుర్తించి అధికారులతో చెప్పినట్లుగా చెబుతున్నారు. ఒకవేళ నిర్మల్ ప్రాంతానికి మేలు జరగకుండా అది అన్యాయమే అవుతుందని గులాబీ సీఎం కేసీఆర్ అభిప్రాయపడినట్లుగా తెలుస్తోంది. ఇక ముసాయిగా ప్రతిపాదను వెల్లడించిన తరువాత మంత్రి మండలి సమావేశం నిర్వహించనున్నారు .అనంతరం అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసి తుది నిర్ణయం తీసుకోనున్నారు. అయితే ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ నేతృత్వంలోని ఈ కమిటీ పలు అంశాలపై అధ్యయనం చేయనుంది . ఈ కమిటీకి డిప్యూటీ సీఎం మహమూద్ అలీ చైర్మన్‌గా వ్యవహారిస్తారు. సభ్యలుగా మరో డీప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వర్ రావు, జూపల్లి కృష్ణారావు లు ఉన్నారు. ఈ సబ్ కమిటీకి కన్వీనర్‌గా రెవెన్యూ శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సెక్రటరీగా సీసీఎల్ఏ వ్యవహారిస్తారు. కానీ ఇక్కడ కొత్త జిల్లాల ఏర్పాటుకు వేసిన మంత్రి మండలి లో మంత్రి కేటీఆర్ పేరు లేకపోవడం గమనార్హం. అయితే మంత్రి కేటీఆర్‌ను తీసుకోకపోవడానికి ఓ బలమైన కారణం ఉందన్న వాదనలు వినబడుతున్నాయి. ఇప్పటికే సిరిసిల్ల జిల్లాగా మార్చాలన్న డిమాండ్‌ను సిరిసిల్ల స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కేటీఆర్ ప్రత్యేకించి సీఎం కేసీఆర్ దృష్టి కి తీసుకెళ్లారు. అయితే దీనిపై అప్పట్లోనే ఓ సంకేతాలు కూడా ఇచ్చారు. సిరిసిల్ల జిల్లాను మార్చేందుకు సిద్దంగా ఉన్నా గులాబీ నేత అనూహ్యంగా మార్పు చేశారు. ఇప్పటికే జిల్లాల విషయంలో భారీ స్థాయిలో నే డిమాండ్లు ఉన్నాయి. మా ప్రాంతాలను జిల్లాగా మార్చాలని, మా ప్రాంతం జిల్లాకు అనుకూలంగా ఉందని చెబుతూ చాలా మంది ఉద్యమ బాట పట్టారు కూడా. ఈ క్రమంలో జనగాం జిల్లా, గద్వాల్ ను జిల్లాలుగా మార్చాలని అక్కడి నాయకులు ఉద్యమ బాట పట్టారు. జనగాం ను యాదాద్రి జిల్లాలో కలపకుండా ప్రత్యేక జిల్లాను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉంది. ఆధికార పార్టీ నేత, స్థానిక ఎమ్మెల్యే సైతం సీఎం దృష్టికి తీసుకు వచ్చారు. ఇకపోతే గద్వాల్ జిల్లాగా మార్చాలంటూ ఆ నియోజక వర్గం ఎమ్మెల్యే, మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే అరుణ సైతం డిమాండ్ చేయడమే కాకుండా పెద్ద ఎత్తున్న ఉద్యమాలు కూడా చేస్తున్నారు. కానీ అక్కడి భౌగోళిక పరిస్థితులు, ప్రజా ప్రయోజనాలను దృష్టిలోకి తీసుకన్న సర్కార్ గద్వాల్‌ను జిల్లా మార్చడం కష్టసాద్యమనే వాదనలు ఉన్నాయి. ఇక ఇదే పరిస్థితి జనగాం ప్రాంతం ఎదురుకుంటుంది. యాదాద్రి జిల్లాకు సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న జనగాంను జిల్లా చేయడం సాధ్యం కాదన్నది సర్కార్ వాదన. ఈ క్రమంలో కేటీఆర్ డిమాండ్ ప్రకారం సిరిసిల్లను జిల్లా చేయడం వల్ల ఇరు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున్న నిరసనలు వెలువెత్తే అవకాశం లేకపోలేదు. ఈ క్రమంలోనే సిరిసిల్లను జిల్లా గా మార్చడంలో సందిగ్దత నెలకొంది. ఇదీలా ఉంటే గడిచిన రెండేళ్ల కాలంలో కేటీఆర్‌కు పెద్ద పీట వేస్తున్నారన్న ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీ అంటేనే వారి ఇంటీ పార్టీ అన్ని నినాదాలు నాటి నుంచే ఉన్నాయి. పూర్తి విషయాలను దృష్టిలో పెట్టుకున్న గులాబీ సీఎం కేసీఆర్ తనదైన శైలీలో వ్యవహరిస్తున్నారటంలో సందేహం లేదు. తాను ప్రాతినిధ్యం వహించే అసెంబ్లీ నియోజక వర్గంలో కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలని కేటీఆర్ ఎంతగా తపించినా సీఎం కేసీఆర్ మాత్రం పట్టించుకోకపోవడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. అయితే ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయడంతో సిరిసిల్లపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో మరి కొద్ది రోజుల్లో తేలిపోతుంది. మరోవైపు, రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనంటారు. తెలంగాణలోని తాజా పరిణామాలు చూస్తుంటే ఈ నానుడి నిజమే అనిపిస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి తన ప్రభుత్వంలోని మంత్రులు, అధికారులపై నిఘా పెట్టారట. సాధారణంగా పాలకులు ఇలాంటి నిఘా ఉంచడం మామూలే. అసలు తమ ప్రభుత్వంలో ఏంజరుగుతుందో తెలుసుకోవాలని అలాంటి నిఘా ప్రయత్నాలు చేయవచ్చు. కానీ సహజంగా తమకు నమ్మకంలేని వ్యక్తులు, వ్యవస్థలు, ప్రత్యర్థులపై ఇలాంటి నిఘా అస్త్రం వాడతారు. కానీ తెలంగాణ సీఎం కేసీఆర్ తన అనుంగు వ్యక్తులపై కూడా నిఘా మంత్రం పఠిస్తున్నారు. సాక్షాత్తూ తన కొడుకు కేటీఆర్, మేనల్లుడు హరీశ్ రావులపైనా కేసీఆర్ నిఘా ఉంచారట. ఈ విషయాన్ని ఓ ఆంగ్లపత్రిక ఆ మధ్య బయటపెట్టింది. తెలంగాణలో ఐదుగురు ముఖ్యమైన మంత్రుల పేషీలపై కేసీఆర్ నిఘా పెట్టించారన్నది ఆ పత్రిక కథనం. ఆర్దిక మంత్రి ఈటెల రాజేందర్, మున్సిపల్,ఐటి శాఖ ల మంత్రి కె.తారక రామరావు, నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మరో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వంటి వారిపైనా కేసీఆర్ నిఘా పెట్టినట్లు ఆ పత్రిక కథనం. అయితే ఇందులో అంత ఆశ్చర్యపోవాల్సిందేమీలేదని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ముఖ్యమంత్రి వివిధ కారణాల వల్ల సచివాలయానికి పెద్దగా రావడం లేదు. దీంతో మంత్రులు కూడా అంతంతమాత్రంగానే సచివాలయానికి వస్తున్నారు. దీన్ని అలుసుగా తీసుకుని కొందరు అధికారులు బాగా లంచాలకు అలవాటు పడ్డారట. అలాంటి వారిని కంట్రోల్ చేసేందుకే ఈ నిఘా అని వివరణ ఇస్తున్నారు.

Tag: Is it true that his father’s ‘surveillance’ is not dominated by TRS?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *