Is there a need for the poor in this country?

ఈ దేశం లో పేదవాడికి వైద్యం కరువా?

– జిల్లా కలెక్టరే చేతులెత్తేసారూ..
 – ముఖ్య మంత్రి గారు కళ్ళు తెరువండి
Date:13/02/2018
గుంటూరు ముచ్చట్లు:
పేదవాడి కడుపున పుట్టిన పాపానికి నిరుపేద ముగ్గురి పిల్లల ప్రాణాలు గాలిలో కలిసి పూవలసిన్దీనా? ఈ పిల్లల ప్రాణాలు కాపాడే బాధ్యత మన సంక్షేమ దేశం లో ప్రజా ప్రభుత్వాలకు లేదా..? ఓ జిల్లా కలెక్టరే చేతులెత్తేస్తే తమ గోడు ఎవరికీ చెప్పుకోవాలి…? వాళ్లకు దిక్కెవరు..? ఆరోగ్యశ్రీయో..రాబోయే మోడీ కెరో ఓ నిరుపేద ముగ్గురి పిల్లల ప్రాణాలు కాపాడగలవా..? కార్పొరేట్ ఆసుపత్రిలో 90లక్షలు ఖర్చుచేసి వైద్యం చేయించ లేని తల్లి కడుపున పుట్టిన ముగ్గురు పసి పిల్లల ప్రాణాలు అనంత వాయువులలో కలసిపోవాల్సిందేనా..? తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటకు చెందిన అమర్తి వెంకన్న, చిన్ని దంపతులకు ముగ్గురు పిల్లలు. వీరు వ్యవసాయ కూలీలు. ఒక సంవత్సరం నుండి ఏడేళ్ల వయస్సు గల వీరి ముగ్గురు పిల్లలు అరుదైన కాలేయ వ్యాధితో బాధ పడుతున్నారు. దీనివల్ల పిల్లలు బరువు పెరిగిపోతున్నారు. అయితే వీరికి ఒక్కొక్కరికి రూ.30లక్షలు ఖర్చు చేసి కార్పొరేట్ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేయిస్తే వారి ప్రాణాలు దక్కుతాయట. సహాయం కోసం అనేక మంది రాజకీయ నేతలు, దాతల చుట్టూ తిరిగారు. పలు కార్పొరేట్ ఆసుపత్రుల మెట్లు ఎక్కారు. కాని సొమ్మే సమస్య అయ్యింది. రెక్కాడితే గాని డోక్కాడని వెంకన్న, చిన్నిలు అన్ని లక్షలు ఎక్కడి నుండి తెగలరు..? సోమవారం కాకినాడ వెళ్ళి గ్రీవెన్స్ సెల్ లో జిల్లా కలెక్టర్ ను కలసి తమ మొరను వినిపించారు. కాని కలెక్టర్ జాలి పడ్డారు. నిస్సాయతను వ్యక్తం చేసారట. దిక్కుతోచక ఆ తల్లిదండ్రులు కలక్టరేట్ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద కూర్చొని రోదిస్తూన్న వార్త కలచి వేసిందని సామాజిక ఉద్యమకరురాలు ,బహుజన పోరాట సమితి నాయకురాలుకరణం సరస్వతి  ఆవేదన వ్యక్తం చేసారు.దీని ఫై రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు స్పందించాలని ఆమె విజ్ఞప్తి చేసారు. అవసరమైతే చట్టాలు మార్చాలి. గతంలో అప్పటి ముఖ్యమంత్ర్రీ వై ఎస్ రాజశేఖర రెడ్డి విప్లవ కళాకారుడు వంగపండు మనవడి ప్రాణాలు కాపాడటానికి తన విస్తృత అధికారులు వినియోగించి నట్లే ఈ ముగ్గురు పిల్లల ప్రాణాలు కాపాడటానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకొని తన మానవత్వాన్ని చాటాలని కరణం సరస్వతి కోరారు.
Tags: Is there a need for the poor in this country?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *