ఇస్రో ప్రదర్శన శాల.

విశాఖపట్నం ముచ్చట్లు:
అంతరిక్షంలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టడంలో అంతర్జాతీయ ఖ్యాతి సాదించిన ఇస్రో తన ప్రయోగశాల స్పేస్ రీసెర్చ్ విశేషాలను విస్తరించేందుకు బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.శాటిలైట్ ఉపయోగాలు,దేశాభివృద్దికి స్పేస్ రీసెర్చ్ అందిస్తున్న సేవలను నేరుగా వివరించేందుకు స్పేస్ హీల్స్ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది.దీంట్లో బాగంగా విశాఖ ఏయూ సైన్స్ వారోత్సవాల్లో బాగంగా శ్రీహరికోట ఇస్రో అధికారుల సహకారంతో ప్రదర్శనశాలను ప్రారంభించారు.దేశంలో స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తైన సైన్స్ పై నేటి తరం విద్యార్ధుల్లో అవగాహన వచ్చేందుకు ఇస్రో సహకారంతో ఉపగ్రహాల ఉపయోగాలను వివరించేలా ప్రదర్శన శాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.1960 నుంచి దినదినాభివృద్ది చెందుతున్న టెక్నాలజీ ఆధారంగా నింగిలోకి దూసుకెళ్తున్న ఉపగ్రహాల,రాకెట్స్,చంద్రయాన్ ఇలా విలువైన సమాచారాన్ని విద్యార్ధులు తెలుసుకునేలా వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
పుంగనూరులో రిపబ్లిక్‌డే నాడు బిరియాని విక్రయాలు
Tags:ISRO Museum

Natyam ad