ప్రాక్టికల్ పరీక్షలకు హాల్ టిక్కెట్లు విడుదల…
విజయవాడ ముచ్చట్లు:
మార్చి 11 నుంచి ప్రారంభంకానున్న ఆంధ్రప్రదేశ్ 2021-22 ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ పరీక్షల కు సంబంధించిన హాల్ టికెట్లను మంగళవారం మార్చి 8 ఏపీ ఇంటర్ బోర్డు విడుదల చేసింది. కాగా ఇంటర్ థియరీ పబ్లిక్ పరీక్షలు ఏప్రిల్ 22 నుంచి మే 12వ తేదీ వరకూ జరగనున్నాయి. ఏప్రిల్ 7 నుంచి ప్రారంభం కావల్సిన ఈ పరీక్షలు..జేఈఈ మెయిన్స్ పరీక్ష తేదీల కారణంగా వాయిదా పడ్డాయి. నోటిఫికేషన్లో సూచించిన విధంగా ప్రాక్టికల్ పరీక్షలు పూర్తి అయిన తర్వాత థియరీ పరీక్షలు ప్రారంభం అవుతాయి. ఇంటర్మీడియట్ విద్యార్ధుల రోల్ నెంబర్ లేదా ఆధార్ కార్డు నెంబర్‌తో కూడా హాల్ టికెట్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాగా ఏప్రిల్ 22 నుంచి మే 12 వరకు జరిగే థియరీ పరీక్షలకు హాల్ టికెట్లు వేరుగా ఉంటాయి. అవి త్వరలో విడుదల కానున్నట్లు ఈ సందర్భంగా ఏపీ ఇంటర్ బోర్డు విద్యార్ధులకు సూచించింది.
ఏపీ ఇంటర్ 2022 ప్రాక్టికల్ పరీక్షల హాల్ టికెట్లు ఎలా డౌన్లోడ్ చేయాలంటే..
ముందుగా ఏపీ ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారిక వెబ్సైట్ https://bie.ap.gov.in/ ఓపెన్ చేయాలి.
హోమ్‌పేజ్‌లో Download Practical Hall Tickets March 2022 పై క్లిక్ చేసిన తర్వాత న్యూ పేజ్ ఓపెన్ అవుతుంది.
లాగిన్ అవ్వడానికి ఫస్ట్ ఇయర్ పబ్లిక్ ఎగ్జామ్‌కు సంబంధించిన రోల్ నెంబర్ లేదా హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చెయ్యాలి. వెంటనే స్క్రీన్‌పై హాల్ టికెట్ ఓపెన్ అవుతుంది.డౌన్లోడ్ చేసుకుని, ప్రింట్ ఔట్ తీసుకోవాలి.
Tags:Issuance of hall tickets for practical examinations