ప్రగతి లో ఉన్న పనులలో నిర్లక్ష్యం తగదు- జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ పుట్టమధు

 
పెద్దపల్లి  ముచ్చట్లు:
జిల్లాలో ప్రగతి లో ఉన్న పనులలో నిర్లక్ష్యం తగదని జడ్పీ చైర్మన్ పుట్ట మధు అన్నారు. జడ్పీ  కార్యాలయంలో   2వ , 4వ మరియు 7వ స్థాయి  సంఘం సమావేశాలను నిర్వహించారు. గ్రామీణాభివృద్ధి
,విద్య & వైద్యం, పనులు  పై జడ్పీ చైర్మన్  అధ్యక్షతన సమావేశం నిర్వహించి  వాటి పరిధిలో జిల్లాలో జరుగుతున్న పనుల గురించి  చర్చించారు.   జిల్లా ప్రజాపరిషత్ ద్వారా అందిన  నిధులు, వాటి
వినియోగం,  గ్రామాలలో చేపట్టిన పనుల  పై చైర్మన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.  గ్రామ అభివృద్ది పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.  *గ్రామాల అభివృద్దికి  తెలంగాణ ప్రభుత్వం
ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని,  ప్రతి గ్రామంలో ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్   ఏర్పాటు చేసుకున్నామని, వాటిని వినియోగిస్తు  గ్రామాలను  పరిశుభ్రంగా చేయాలని,  ప్రతి రోజు చెత్తను డంపింగ్  యార్డుకు
తరలించాలని సూచించారు.  హరితహారం కింద నాటిన మొక్కల సంరక్షణకు  చర్యలు తీసుకోవాలని,  నూతన పంచాయతి రాజ్ చట్టం ప్రకారం కనీసం 75% సంరక్షించాలని అన్నారు. జిల్లా వ్యాప్తంగా గ్రామీణ
ప్రాంతాలొ  కనీస మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి  పెండింగ్ లో ఉన్న నిర్మాణ పనులు వెంటనే  ప్రారంభించి త్వరితగితన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని జడ్పీ చైర్మన్ ఆదేశించారు.  ఈ
సమావేశంలో  జడ్పీ  సీఈఒ, జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి శ్రీధర్,  జడ్పీటిసిలు రాంమూర్తి,  తిరుపతి రెడ్డి,శారద, నారాయణ,కో ఆప్షన్ సభ్యులు యండి.సలామొద్దిన్,దివాకర్ ,ప్రజాప్రతినిధులు , అందరూ
జిల్లా అధికారులు తదితరులు  పాల్గొన్నారు.
 
Tags:It is not appropriate to neglect the work in progress – Zilla Praja Parishad Chairman Puttamadhu

Natyam ad