లైంగిక వేధంపులు చేసింది నిజమే

-ఒప్పుకున్న వినోద్ జైన్
 
విజయవాడ ముచ్చట్లు:
 
తన లైంగిక వేధింపులతో బాలిక జీవితాన్ని నాశనం చేసిన విజయవాడ టీడీపీ నాయకుడు వినోద్‌జైన్ పోలీసుల ఎదుట నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. బాలికపట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ఒప్పుకున్నాడు. బాలిక ఆత్మహత్య చేసుకునేంతవరకు ఈ ఘటన వెళ్తుందని ఊహించలేదని వినోద్ జైన్ పోలీసులతో అన్నట్లు తెలిసింది.విజయవాడ కుమ్మరిపాలెం సెంటర్‌లోని   లోటస్‌ లెజెండ్‌ అపార్ట్‌మెంట్‌లో టీడీపీ నేత వినోద్‌ జైన్‌ లైంగిక వేధింపులు తాళలేక 14 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు  కారణమైన వినోద్ జైన్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.  బాలిక బెంజి సర్కిల్ వద్ద ఒక స్కూల్ లో 9వ తరగతి చదువుతోంది.రెండు నెలలకు పైగా వినోద్‌జైన్ తనపై చేస్తున్న లైంగిక వేధింపులు తట్టుకోలేక బాలిక జనవరి29న అపార్ట్ మెంట్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకోటానికి ముందు బాలిక రాసిన సూసైడ్ నోట్ ద్వారా వినోద్ జైనును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అపార్ట్‌మెంట్ వద్ద లభించిన సీసీ టీవీ ఫుటేజ్‌ను చూపిస్తూ పోలీసులు వినోద్ జైన్‌ను ప్రశ్నిస్తున్నారు.బాలిక ఆత్మహత్య దృశ్యాలు రికార్డై ఉన్నాయి. బాలిక స్కూల్‌కు వెళ్లేప్పుడూ… వచ్చేప్పుడు అపార్ట్‌మెంట్‌లో మెట్లు ఎక్కే సమయంలో…. దిగే సమయంలో, లిఫ్ట్ వద్ద బాలికను వేధించినట్టు అంగీకరించాడు. స్కూల్ కు వెళ్తున్నప్పుడు, వచ్చేటప్పుడు పాపకోసం ఎదురు చూసి ఆమెను తాకుతూ  ఇబ్బందులకు గురి చేసినట్లు పోలీసులకు తెలిపాడు. పాపకు సన్నిహితంగా మెలిగేందుకు ప్రయత్నించానని తెలిపాడుబాలికను తాకుతూ తాను ఆనందం పొందేవాడినని పోలీసుల విచారణలో వినోద్‌జైన్ నేరం ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. తాను చేసింది తప్పేనని…. ఆ బాలిక ఆత్మహత్య చేసుకుంటుందని ఊహించలేదని… వ్యవహారం ఇంత దాకా వస్తుందని ఊహించలేదని చెప్పినట్లు తెలిసింది. బాలిక ఆత్మహత్య చేసుకునే ముందర డాబాపైన  పిట్టగోడ వద్దకు వెళ్లినప్పుడు అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు బాలికను….. కిందపడతావు… అని వారించినట్లు.. అంతా  నిమిషంలోపే జరిగిపోయిందని వారు చెబుతున్నారు.
 
Tags: It is true that sexual harassment did

Natyam ad