రవీంద్ర భారతి స్కూళ్ల పై ఐటీ రైడ్స్

Date:15/02/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
తెలుగు రాష్టాల్లోని ప్రముఖ విద్యా సంస్థ రవీంద్ర భారతిపై ఐటీ శాఖ దాడులు నిర్వహించింది.   రాష్టంలో రవీంద్ర భారతీతో పాటు వివిధ రకాల స్థానిక పేర్లతో ఇంటర్నేషనల్ స్కూల్స్ నడుపుతున్న ఆ సంస్థ ప్రధాన కార్యాలయాలతో పాటు  బ్రాంచీలలోనూ ఐటీ అధికారులు గురువారం ఉదయం నుంచి సోదాలు నిర్వహించారు.  నెల్లూరు నగరంలోని ఫతేఖాన్ పేటలో ఉన్న  ఆ సంస్థ తొలి బ్రాంచ్ రవీంద్ర భారతిలో నలుగురు అధికారులతో కూడిన బృందం సోదాలు నిర్వహించింది. . విజయవాడ నుంచి వచ్చిన ఆ బృందం కార్యాలయం లోపలికి వెళ్లి రికార్డుల్నింటిని పరిశీలించింది.  ఆఫీసు సిబ్బందిని సైతం బయటికి పంపి ఐటీ అధికారులు రవీంద్ర భారతికి చెందిన ఆర్దిక వివరాలను సేకరించారు.   ఐటీ దాడులకు సంబంధించిన సమాచారం కోసం వెళ్లగా వివరాలు చెప్పేందుకు అధికారులు నిరాకరించారు. నెల్లూరుతోపాటు తెలుగు రాష్టాల్లోని పలు బ్రాంచీలపై ఐటీ అధికారులు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
Tags: IT rides on Savithri Bharathi schools

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *