పుల్వామా దాడికి ఉగ్ర ఘాతుకానికి 40 మంది సైనికులు బలైన రోజు

జమ్మూ కశ్మీర్‌ ముచ్చట్లు:
జమ్మూ కశ్మీర్‌లో సైనిక బలగాలే లక్ష్యంగా ఉగ్రమూకలు నిరంతరం దాడులకు పాల్పడుతుంటాయి. అయితే, ఏకంగా సైనిక వాహనశ్రేణినే టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు ఫిబ్రవరి 14న జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో సైనిక వాహన శ్రేణిపై పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్)కి చెందిన 40 సైనికులు బలయ్యారు. జమ్ము- శ్రీనగర్ జాతీయ రహదారిపై లేథిపుర (అవంతిపురా సమీపం)లో 2019 ఫిబ్రవరి 14న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ ఘాతుకం చోటుచేసుకుంది. జమ్మూ నుంచి సైనికులు శ్రీనగర్‌కు వెళ్తుండగా ఈ దాడి జరిగింది.
 
Tags; It was a day when 40 soldiers were killed in a fierce attack on Pulwama

Natyam ad