ఐటీడీఏ ఈఈ ఇంట్లో ఏసీబీ సోదాలు

Date:12/01/2018

ఉట్నూరు ముచ్చట్లు:

అక్రమ, ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఫిర్యాదుపై ఉట్నూరు ఐటీడీఏ ఇంజినీరింగ్‌ విభాగంలో ఈఈగా పనిచేస్తున్న రమేశ్‌ ఇంట్లో అనిశా అధికారులు సోదాలు నిర్వహించారు. వరంగల్‌ జిల్లాకు చెందిన ఈయన గత రెండేళ్లుగా ఇక్కడ ఈఈగా పనిచేస్తున్నారు. ముందు నుంచి ఈయనపై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కరీంనగర్‌ రేంజ్‌ ఏసీబీ అధికారులకు వచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం ఉట్నూరు ఐటీడీఏ క్వార్టర్స్‌లో ఉంటున్న రమేశ్‌ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఏసీబీ సీఐలు సతీష్‌, వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈఈ రమేశ్‌పై అక్రమ, ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలపై ఆయనపై కేసు నమోదు చేశామన్నారు. ఇందులో భాగంగా ఈఈ రమేశ్‌కు సంబంధించిన ఉట్నూర్‌, హైదరాబాద్‌లోని వనస్థలిపురం, వరంగల్‌, కొత్తగూడెంలోగల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు చేపట్టామన్నారు.

Tags : ITDA is the ACB searches in this house

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *