గోల్కొండ కోటకు చేరుకున్న ఇవాంకా

హైదరాబాద్ ముచ్చట్లు:
ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో పాల్గొనడానికి నగరానికి వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ గోల్కొండ కోటకు చేరుకున్నారు. భారీ భద్రత మధ్య ఇవాంకా ఇక్కడికి చేరుకున్నారు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ గోల్కొండకు రాలేదు. ఇవాంకతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ వచ్చారు. మరోవైపు గోల్కొండలో తెలంగాణ ప్రభుత్వం విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ విందులో ముఖ్యంగా తెలంగాణ రుచులను రుచి చూపించబోతున్నారు. మరోవైపు సెక్యూరిటీ కారణాల వల్ల ఇవాంకా చార్మినార్, లాడ్ బజార్ సందర్శన రద్దయిన సంగతి తెలిసిందే. దీంతో గోల్కొండ వద్ద అమె కోసం కొన్ని గాజుల స్టాల్స్ను కూడా ఏర్పాటు చేశారు. వీటితో పాటు ప్రభుత్వ పనితీరును తెలియాజేసే 12 స్టాల్స్ను ఏర్పాటు చేశారు. ఇవాంకా కోసం కోటలో బ్యాటరీ కార్లను ఏర్పాటు చేశారు. అయితే అమె నడుచుకుంటూ వెళ్లారు.
Tag:Ivanca to Golconda Fort


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *