ఉద్యమం చేస్తున్న ఉద్యోగులకు జగన్ సర్కార్ మరో ఝలక్

– కొత్త పీఆర్సీ, తగ్గించిన హెచ్ఆర్ఏ ప్రకారమే వేతన బిల్లులు
–  అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు
 
అమరావతి ముచ్చట్లు:
 
ఉద్యమం చేస్తున్న ఉద్యోగులకు జగన్ సర్కార్ మరో ఝలక్ ఇచ్చింది. కొత్త పీఆర్సీ, తగ్గించిన హెచ్ఆర్ఏ ప్రకారమే వేతన బిల్లులు తయారు చేయాలని అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లాయి. కొత్త సాఫ్ట్‌వేర్ తయారు చేసి ఇప్పటికే జిల్లాలకు పంపారు. ఈ నెల 25వ తేదీలోపు బిల్లులు పంపాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. 23 శాతం ఫిట్‌మెంట్‌తో కోతపెట్టిన హెచ్ఆర్ఏ, కొత్త డీఏలను కలుపుకుని బిల్లుల తయారీకి ఆదేశాలిచ్చింది. కాగా పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని ఉద్యోగ సంఘాలు చేస్తున్న డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. ప్రతి నెల 28వ తేదీ నాటికి బిల్లులు తీసుకునే సర్కార్ ఈసారి 25వ తేదీకే బిల్లులు పంపాలని అధికారులకు ఆదేశాలిచ్చింది.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Jagan Sarkar is another beacon for the employees of the movement

Natyam ad