'Jai Simha' Contest for 'Anonymous'?

‘అజ్ఞాతవాసి’కి ‘జై సింహా’ పోటీనా?

Date: 08/01/2018

హెదరాబాద్‌ ముచ్చట్లు:

మూవీ టీజర్ రిలీజ్ ముందువరకు ఇండస్ట్రీ మొత్తం ‘అజ్ఞాతవాసి’ జపం చేసింది. ఈ చిత్రంపై నెలకొన్న అంచనాలు, ప్రతిచోటా నెలకొన్న బజ్, భారీఎత్తున్న రిలీజ్‌ కానుండడంతో.. ఇది సంచలనాలకు కేంద్రబిందువుగా నిలుస్తుందని భావించారు. బరిలో పోటీగా ‘జై సింహా’ సినిమా ఉన్నప్పటికీ ‘అజ్ఞాతవాసి’ క్రేజ్ ముందు అది బలాదూర్ అవుతుందని అనుకున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ‘అజ్ఞాతవాసి’ సునామీ ముందు ‘జై సింహా’ కొట్టుకుపోతుందని ఊహించారు. కానీ, ఎప్పుడైతే ఆ సినిమా టీజర్ విడుదలయ్యిందో అప్పుడు ఆ ఊహాగానాలన్నీ తారుమారయ్యాయి. ఇంతలోనే ట్రైలర్, పాటలు కూడా రిలీజ్ కావడంతో ఇప్పుడు ‘జై సింహా’ మేనియా షురూ అయిపోయింది. ఇన్నాళ్లూ ఏదో అనుకున్నాం కానీ, బాలయ్య సినిమాని కూడా తక్కువ అంచనా వేయలేం అంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంతలో ఈ మార్పు రావడానికి ఓ బలమైన కారణం కూడా ఉందిలెండి. అదేంటంటే ‘అజ్ఞాతవాసి’ చిత్రంలో ఇప్పటివరకు క్లాస్ కళ మాత్రమే కొట్టిచ్చినట్లు కనిపిస్తోంది. ఊరమాస్ అందులో ఉన్నట్లు ఒక్క సంకేతం కూడా అందలేదు. ట్రైలర్‌లో ఏవో రెండు షాట్లు చూపించారే తప్ప వాటిని కూడా క్లాస్ టచ్ డామినేట్ చేసేసింది. కానీ ‘జై సింహా’లో మాత్రం ఊరమాస్ మాత్రమే కనిపిస్తోంది. టీజర్, ట్రైలర్‌లలో మాస్‌ని మాత్రమే హైలైట్ చేస్తూ ఆడియెన్స్ నరాల్లో రక్తం ఉడికిపోయేలా వీరలెవెల్లో చూపించారు. చూస్తుంటే బి, సి సెంటర్స్ ఆడియెన్స్‌ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని ఆ చిత్రాన్ని తెరకెక్కించినట్లుగా ఉంది. ఒకవేళ ‘అజ్ఞాతవాసి’లో ఉన్న ‘మాస్’ ప్రేక్షకుల్ని అలరించడంలో విఫలమై, ‘జై సింహా’ గర్జనలు నచ్చితే మాత్రం పవన్ మూవీకి చెందాల్సిన రెవెన్యూ బాలయ్య చిత్రానికి కొట్టుకుపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతోపాటు బాలయ్య చిత్రానికి మరో మేజర్ ప్లస్ పాయింట్ కూడా ఉంది. బాలయ్యకి సంక్రాంతి కలిసొచ్చే సెంటిమెంట్ కూడా ఉంది. ఇప్పటివరకు ఆ పండగ టైంలో రిలీజైన బాలయ్య చిత్రాలన్ని ఘనవిజయాలు సాధించాయి. కమర్షియల్‌గానూ డిస్ట్రిబ్యూటర్స్‌కి లాభాలు తెచ్చిపెట్టాయి. బాలయ్య చిత్రాలకి ఉన్న మరో విచిత్రమైన విశిష్టత ఏంటంటే ఆయన చిత్రాల్ని ప్రెడిక్ట్ చేయడం చాలా కష్టం. విడుదలకి ముందు పెద్దగా క్రేజ్ లేకపోయినా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు నమోదు చేసిన హిస్టరీ బాలయ్యకి ఉంది. కాబట్టి బాలయ్య సినిమాని ఏమాత్రం తక్కువ అంచనా వేయలేం! మొత్తానికి ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద పవన్, బాలయ్య మధ్య ‘నువ్వా-నేనా’ అనే పోరు భీకరంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

Tags: ‘Jai Simha’ Contest for ‘Anonymous’?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *