Jaitley's key statement on the construction of Amravati

అమరావతి నిర్మాణంపై జైట్లీ కీలక ప్రకటన

-ఏపీ కోరిన రూ. 3,324 కోట్ల రుణంలో రూ. 1500 కోట్లు ఇచ్చామని వెల్లడి

Date: 03/01/2018

అమరావతి ముచ్చట్లు: 

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటులో కీలక ప్రకటన చేశారు. అమరావతి నిర్మాణానికి రూ. 3,324 కోట్ల రుణం ఇచ్చే అంశాన్ని ప్రపంచ బ్యాంకు పరిశీలిస్తోందని చెప్పారు. అమరావతి నిర్మాణానికి నిధుల కేటాయింపుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. దీనిపై స్పందించిన అరుణ్ జైట్లీ రాజధాని నిర్మాణానికి రూ. 3,324 కోట్లు కావాలని ఏపీ ప్రభుత్వం ప్రపంచ బ్యాంకును కోరిందని చెప్పారు. ఈ అంశాన్ని వరల్డ్ బ్యాంక్ పరిశీలిస్తోందని, సంప్రదింపులు పూర్తి అయిన వెంటనే రుణం మంజూరవుతుందని తెలిపారు. అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు నిర్మాణానికి కేంద్రం ఇప్పటికే రూ. 1500 కోట్లు ఇచ్చిందని చెప్పారు.

Tags: Jaitley’s key statement on the construction of Amravati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *