జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ రాజీనామా

Date:19/06/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను గవర్నర్కు పంపించారు. అధికార పిడిపి కూటమినుంచి బిజెపి వైదొలగినట్లు ప్రకటించిన తరువాత ఆమె తన పదవికి రాజీనామా చేసి గవర్నర్కు రాజీనామా లేఖను పంపారు. అంతకుముందు, రాష్ట్ర రాజకీయాలు అత్యంత వేగంగా మారిపోయాయి. రంజాన్ నెలలో అమలులోకి వచ్చిన కాల్పుల విరమణ ఒప్పందంపై మిత్రపక్షాల మధ్య విభేదాలు పోడచూపాయి. కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగించాలని పీడీపీ పట్టుబట్టింది. బిజెపి ససేమిరా అనడంతో పిడిపి – బిజెపి కూటమి  మధ్య బీటలు బారాయి. దాంతో బిజెపి,  ముఫ్తీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తున్నట్లు ప్రకటన చేసింది. పిడిపి కూటమినుంచి వైదొలగామని, ముఫ్తీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించామని లేఖను గవర్నర్కు అందజేసింది. బీజేపీ పార్టీ ప్రధాన కార్యదర్శి జమ్ముకశ్మీర్ ఇన్చార్జ్ రాంమాధవ్ మాట్లాడుతూ  పీడీపీతో కలిసి కొనసాగడం బీజేపీ వల్ల కాదని చెప్పారు. కశ్మీర్లో ఉగ్రవాదం, హింస పెరిగిపోయింది. పౌరుల ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగింది. ఇందుకు జర్నలిస్ట్ షుజాత్ బుఖారీ హత్యే దీనికి నిదర్శనమని అన్నారు. దేశ సమగ్రత, ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో           పరిస్థితులను అదుపులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో అధికారాన్ని గవర్నర్కు ఇవ్వాలని నిర్ణయించినట్లు అయన అన్నారు.
కాంగ్రెస్ సినీయర్ నేత   గులాం నబీ ఆజాద్  మాట్లాడుతూ అంతా మంచికే జరిగిందని అన్నారు. బిజెపి రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేసిందని, ఇప్పుడు ప్రభుత్వంనుంచి వైదొలగిందని ఆయన అన్నారు. గత మూడేళ్లలో అనేకమంది పౌరులు, సైనికులు హతమయ్యారని ఆయన గుర్తు చేశారు.
Tags:Jammu and Kashmir Chief Minister Mehbooba Mufti resigned

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *