ప్రారంభోత్సవానికి సిద్దమయిన  జనగామ తెరాస పార్టీ కార్యాలయం

జనగామ ముచ్చట్లు:
 
జనగామ జిల్లా తెరాస పార్టీ జల్లా కార్యాలయం త్వరలోనే ప్రారంభం అవుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు. సోమవారం నాడు . జనగామ పార్టీ కార్యాలయాన్ని మంత్రి ఎర్రబెల్లి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతో కలిసి సందర్శించారు. నిర్మాణ పనులను పరిశీలించారు. కార్యాలయాలను చూశారు. పార్టీ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కాళోజీ, జ్యోతిరావు ఫూలే, సావిత్రి ఫూలే విగ్రహాలను పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో మిగతా జిల్లాల పార్టీ కార్యాలయాలు ప్రారంభోత్సవానికి సిద్ధం అవుతున్నాయని తెలిపారు. ఆయా కార్యాలయాలను సిఎం కెసిఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ల చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు జరిపిస్తామని వెల్లడించారు. పార్టీ కార్యాలయం కొద్ది రోజుల క్రితం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కావాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల వాయిదా పడిందని మంత్రి తెలిపారు. త్వరలోనే సీఎంతో మాట్లాడి మరో డేట్ తీసుకుంటామని తెలిపారు. పార్టీ కార్యాలయాలు ప్రారంభమైతే పార్టీ కార్యకలాపాలన్నీ అందులోనే జరుపుకునే వీలు కలుగుతుందన్నారు. పార్టీ శ్రేణులకు కూడా అనుకూలంగా ఉంటుందన్నారు. పార్టీ కార్యాలయాలు సర్వాంగ సుందరంగా సకల సదుపాయాలతో నిర్మిస్తున్నట్లు మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.
దాడులను అరికట్టాలి
Tags: Janagama Teresa party office ready for inauguration

Natyam ad