శాప్ జీవోను ఖండించిన జనసేన

విజయవాడ ముచ్చట్లు:
 
ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ద్వారా ఆటల్లో పాల్గొనాలంటే క్రీడాకారులు డబ్బులు కట్టి ఆడాలనే ప్రతిపాదనలతో శాప్ జీవో విడుదల చేయడాన్ని జనసేన పార్టీ ఒక శాఖలో తీవ్రంగా ఖండించింది. క్రీడాకారులకు కనీస వసతులు కల్పించకుండా క్రీడా శాఖ అధికారులు క్రీడాకారుల నుంచి డబ్బులు వసూలు చేయడం సమంజసం కాదని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుందరపు విజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలలను గొప్పగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకుంటున్న ప్రభుత్వం… ఫిజికల్ ఎడ్యుకేషన్ విషయంలో క్రీడాకారులను తీవ్ర నిరాశకు గురి చేస్తోందని దుయ్యబట్టారు. క్రీడాకారులు నుంచి డబ్బులు వసూలు చేసే జీవోను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని జనసేన హెచ్చరించింది.
 
Tags: Janasena condemns shop life

Natyam ad