ఏర్పేడులో జనసేన పార్టీ గ్రామపర్యటన

ఏర్పేడు ముచ్చట్లు:
 
జనసేన పార్టీ గ్రామపర్యటన లో భాగంగా ఈరోజు శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం కందాడు గ్రామ పంచాయతీలోని సదాశివ పురం ప్రాంతంలో పర్యటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి కొట్టే సాయి  గ్రామ ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా గోవిందపురం కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ లేదని,పిల్లలకు అంగన్వాడి స్కూలు పక్కన ఉన్న ప్రాంతంలో ఉండడంవల్ల పిల్లలు అంత దూరం వెళ్లడం కష్టంగా ఉందని వాపోయారు.ఈ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కార దిశగా కృషి చేస్తామని వాళ్లకు హామీ ఇచ్చారు. అలాగే గ్రామంలో పేదవారికి నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఒక వృద్ధుని కి జనసేన పార్టీ తరఫున ఆర్థిక సహాయం మరియు ఒక ఫ్యాను ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కుమార్, షణ్ముగం, సత్తార్ భాష ,లోకేష్, రమేష్, మధు, జీపాళ్యం కిరణ్, సాయి,మారి, రాకేష్, హర్ష,మునిరామయ్య, పాల్గొన్నారు.
 
Tags; Janasena Party village tour in formation

Natyam ad