Jayalalithaa's first tantra today

జయలలిత ప్రథమ వర్థంతి నేడు

తమిళనాడు ముచ్చట్లు:
తమిళనాడు మాజీ సీఎం, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత తుదిశ్వాస విడిచి నేటికీ ఏడాది. గతేడాది ఇదే రోజున చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటు తో మరణించింది. అమ్మ మరణంతో రాష్ట్రం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. జయలలిత లేదన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేపోయారు. అప్పుడే అమ్మ చనిపోయి ఏడాది గడిచిందా అని ఇప్పటికి ప్రజలు నమ్మలేకపొతున్నారు. అమ్మ మరణించినకాని మా హృదయాల్లో ఎప్పుడు నిలిచి ఉంటుందని అంటున్నారు.ఇక అమ్మకు నివాళి అర్పించేందుకు భారీ సంఖ్యలో అభిమానులు ఆమె సమాధి వద్దకు వస్తున్నారు. అభిమానులు, అన్నాడీఎంకే కార్యకర్తలు, నేతలు, పలువురు సినీ ప్రముఖులు అమెకు ఘన నివాళి అర్పించారు. కొందరు జయతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు.
Tags : Jayalalithaa’s first tantra today


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *