తిరుమలలో టూవీలర్స్ కు జీపీఎస్

Date:15/03/2018
తిరుమల ముచ్చట్లు:
రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు టూవీలర్స్‌కి గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టమ్‌(జీపీఎస్‌)ను అమర్చకోవాలని తిరుపతి ఆర్టీఓ వివేకానందరెడ్డి సూచించారు. అధునాతన బైక్‌లపై యువత రాత్రి వేళల్లో  రేస్‌లో పాల్గొంటున్నారని, దీంతో ప్రమాదాలు చోటు చేసుకుని అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. వీటిని అరికట్టేందుకు జీపీఎస్‌ ఎంతో దోహదపడుతుందన్నారు. దానికి తోడు వారి వారి పిల్లలు బైక్‌లపై ఎక్కడికి వెళుతున్నారో, ఎంత స్పీడు వెళుతున్నారన్న విషయాలను సెల్‌ఫోన్‌ ద్వారా తల్లిదండ్రులు తెలుసుకునేందుకు వీలుగా ఉంటుందన్నారు. ప్రతి తల్లిదండ్రులు వారి పిల్లల భద్రత, భవిష్యత్‌ కోసం వారి బైక్‌లకు జీపీఎస్‌ను అమర్చాలని సూచించారు. మొట్ట మొదటిసారిగా జీపీఎస్‌ అమర్చిన టూవీలర్‌ను ప్రారంభించారు.
Tags: Jeeps to tuvaluers in the Thirumala

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *