జేడ బుడగ జంగమలను ఎస్సీ జాబితాలో చేర్చాలని జంగమల డిమాండ్

Date:24/01/2018

ఏలూరు ముచ్చట్లు:

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు డివిజన్ లోని పిప్పర గ్రామంలో జేడబుడగ జంగమ హక్కుల పోరాట సమితి ఆద్వర్యంలో జేడబుడగ జంగమలను ఎస్సీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గోడపత్రికలను ఆవిష్కరించారు. పిప్పర గ్రామంలో బైలపాటి పిచ్చయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో బిసీ జెఎసి కన్వినర్ చింతపల్లి రమణ ముఖ్యాతిదిగా పాల్గొన్నారు. జేడబుడగజంగమలను ఎస్సీ జాబితాలో చేర్చాలని ఫిబ్రవరి 20 వ తేదీన గుంటూరులో దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు యలమర్తి మధు చేపట్టే ఆమరణ నిరాహార దీక్షకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంచార జాతుల రాష్ట్ర అధ్యక్షుడు పెండ్ర వీరన్న, జిల్లా అధ్యక్షుడు ఇంగువ చిన్నసత్యనారాయణ, సిఐటి నాయకులు రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Tags : Jingle demand to add JDB bubble junk into SC list

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *