ఉద్యోగ ప్రదాత సీఎం కేసీఆర్: ఖమ్మం ఎంపీ నామా..

హైదరాబాద్ ముచ్చట్లు:
సీఎం కేసీఆర్ ఉద్యోగ ప్రకటన పైన టీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వర రావు హర్షం వ్యక్తం చేశారు. ‘ తెలంగాణ ఉద్యమం లో విద్యార్థులు, యువత పాత్ర కీలకమైంది. ముఖ్యమంత్రి ప్రకటనతో నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల కల నెరవేరుతుంది. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాల కల కూడా సాకారమవుతుంది’ అని నామా తెలిపారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకాలు కొనసాగుతున్నాయి.సీఎం కేసీఆర్‌ ప్రకటనతో తెలంగాణ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. ఆదిలాబాద్ జిల్లాలో యువత, టీఆర్ఎస్‌ శ్రేణులు బాణాసంచా కాల్చి ‘జై తెలంగాణ, జై కేసీఆర్‌’ అంటూ నినాదాలు చేశారు. ఇక అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసిన  కీలక ప్రకటనను చూసేందుకు తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున ఆసక్తి చూపించారు.  కొంతమందైతే కారులో  యూట్యూబ్ లైవ్ పెట్టుకొని మరీ  కేసీఆర్ ప్రసంగాన్ని వీక్షించారు.
 
Tags:Job Provider CM KCR: Khammam MP Nama ..

Natyam ad