జగన్ ను కలవనున్న ఉద్యోగ సంఘాలు

అమరావతి ముచ్చట్లు:
ఏపీలో ఉద్యోగుల పీఆర్సీ పంచాయితీకి ఫుల్‌స్టాప్‌ పడింది. ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ జరిపిన చర్చలు సఫలం అయ్యాయి.ఉద్యోగుల ప్రధాన డిమాండ్లలో కొన్నింటిని ప్రభుత్వం అంగీకరించింది. దీంతో సమ్మె చేయాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాయి ఉద్యోగ సంఘాలు. ఈనెల 7నుంచి సమ్మె నిర్వహిస్తామన్న ఉద్యోగులు… ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్టు ప్రకటించారు. ఉద్యోగులంతా విధులకు హాజరుకావాలని పిలుపునిచ్చారు ఉద్యోగ సంఘం నేతలు. అంతేకాదు… 2022, ఫిబ్రవరి 06వ తేదీ ఆదివారం సీఎం జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలుపనున్నారు.
 
Tags: Job unions meeting Jagan

Natyam ad