Journalists should provide free education for children

జర్నలిస్ట్ ల  పిల్లలకు  ఉచిత విద్య అందించాలి 

–  జిల్లా విద్యా శాఖాధి కారిని కలిసిన హెచ్యుజే నేతలు
Date:19/06/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
చాలి చాలని  జీతాలతో ఆర్ధిక ఇబ్బందులతో కొట్టు మిట్టాడుతున్న జర్నలిస్ట్ ల  పిల్లలకు ప్రైవేటు పాటశాలల్లో ఉచిత విద్య అందించాలని హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ (హెచ్ యు జే) డిమాండ్ చేసింది.ఈ మేరకు  యూనియన్ నేతలు మంగళవారం హైదరాబాద్ జిల్లా విద్యా శాఖాధి కారిని కలిసి వినతి పత్రం సమర్పించారు. ప్రజలకు,ప్రభుత్వానికి వారధి గా పనిచేస్తున్న తమ పిల్లలను చదివించుకోవడం భారమై పోతుందని వారు పేర్కొన్నారు.ఇప్పటికే విద్యా సంవస్సరం ప్రారంభమైనందున విద్య హక్కు చట్టం ప్రకారం ప్రతి ప్రైవేటు పాటశాలలోనూ  ఏటా 25 శాతం సీట్లను పేద, బడుగు,బలహీన వర్గాల వారి పిల్లలకు కేటాయించాలని నేతలు పేర్కొన్నారు.విద్య హక్కు చట్టానికి అనుగుణంగా ఆ కోటా లో జర్నలిస్ట్ ల పిల్లలకు మానవతా దృక్పదం తో ప్రైవేటు పాటశాలల్లో ఉచిత విద్య ను అందించే లా ఆదేశాలు జారి చేయాలనీ వారు  విజ్ఞప్తి చేసారు. దీని ఫై విద్యా శాఖదికారి  సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. విద్యా శాఖదికారిని కలిసిన వారిలో ఈ.చంద్రశేఖర్, చలువాది విజయానంద రావు ,నవీన్,ఖలిబ్, స్వామి  తదితరులు ఉన్నారు.
Tags: Journalists should provide free education for children

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *