July 4th is the curse of the fourth ...

జులై నాలుగో తారీకు శాపం…

Date : 14/12/2017

హైదరాబాద్‌ ముచ్చట్లు:

జులై 4, వస్తే చాలు అమెరికా మొత్తం బాణాసంచాతో పేలిపోతుంది. ఎందుకంటే 1776, జులై 4న అమెరికా దేశం పుట్టుకొచ్చింది. అమెరికా రెండో అధ్యక్షుడైన జాన్‌ ఆడమ్స్‌, జులై 4న చనిపోయాడు. పోతూ పోతు థామస్‌ జెఫర్సన్‌ మిగలాలి అని గొణిగాడట. ఆడమ్స్‌ తర్వాత అధ్యక్షుడైన జెఫర్సన్‌ కూడా జులై 4నే చనిపోయాడు. ఆవిధంగా అమెరికా తొలి ముగ్గురు అధ్యక్షుల్లో ఇద్దరు అధ్యక్షులు ఇండిపెండెన్స్‌ డే నాడే పోయారు. ఇదే సంప్రదాయాన్ని కొనసాగించాలనుకొన్నాడా యేమో, అమెరికా ఐదవ అధ్యక్షుడైన్‌ జేమ్స్‌ మన్రో 1831, జులై 4 చనిపోయాడు. అంటే మొదటి ఐదుగురు అధ్యక్షుల్లో ముగ్గురు ఇండిపెండెన్స్‌ డేను జరుపుకొంటూనో, జరుపుకోబోతూనో చనిపోయారన్నమాట. ఈ భీభత్సం ఇక్కడితో ఆగలేదు. అమెరికా సివిల్‌ వార్‌లో అత్యంత ఘోరమైన యుద్ధంగా చెప్పబడేది గెట్టిస్‌బర్గ్‌ యుద్ధం. 1863 జులై 1 మొదలైన ఈ యుద్ధంలో 1,65,620 మంది సైనికులు పాల్గింటే వారిలో దాదాపు 46,200 పైగా సైనికులు చనిపోవడమో, గాయపడ్డమో, తప్పిపోవడమో జరిగింది. ఈ భీకర నరమేధం ముగిసింది జులై 4నే! చివరకు అమెరికా అంతర్యుద్ధానికి మంగళం పాడడానికి బీజం వేసిన విక్స్‌ బర్గ్‌ యుద్ధం కూడా జులై 4నే ముగిసింది.

 

Tags : July 4th is the curse of the fourth …


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *