తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారులకు కాకాని పూజిత ఆర్థిక చేయూత

నెల్లూరు ముచ్చట్లు:
విషాద ఘటన తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె పూజిత ఆర్థిక సహకారం అందించారు.నెల్లూరు జిల్లా, తోటపల్లి గూడూరు మండలం, వెంకన్నపాళెం గ్రామంలో ఇటీవల జరిగిన విషాద సంఘటనలో భార్య భర్తలు మృతి చెందారు. ఈ నేపద్యంలో మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి, తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు “కాకాణి రమణారెడ్డి చారిటబుల్ ట్రస్ట్” నుండి  సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి  కుమార్తె పూజిత లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లిదండ్రులు చిన్నారులకు తన వంతు బాధ్యతగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టా నని పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మనసున్న దాతలు తమ వంతు సహాయ సహకారాలు అందించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Kakani is a revered financier for children who have lost their parents

Natyam ad