Kallur Birthplace, which became Rasabasa - our village program

రసాబాసగా మారిన కల్లూరు జన్మభూమి – మా ఊరు కార్యక్రమం

-ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తే అరెస్టులా…? బిజెపి నాయకుల మండిపాటు

పులిచెర్ల ముచ్చట్లు:

మండల పరిధిలోని కల్లూరు గ్రామంలో జరిగిన 5 వ విడత జన్మభూమి – మా ఊరు కార్యక్రమం రసాబాసగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, నీరు – చెట్టు పథకాలలో లబ్ధిదారులకు జరిగిన అన్యాయంపై ప్రశ్నించినందుకు అరెస్టు చేస్తారా అంటూ బిజెపి నాయకులు మండిపడ్డారు. అర్జీదారులు తమ సమస్యలను అధికారులకు తెలియజేయుటకు గ్రామసభకు వస్తే తెదేపా నాయకులు అడ్డుకున్నారని బిజెపి మండల అధ్యక్షుడు మాదాస్ బాలసుబ్రమణ్యం ఆరోపించారు. ఈ విషయంపై బిజెపి నాయకులకు తెదేపా నాయకులకు ఘర్షణలు తలెత్తకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా ఎస్సై విశ్వనాథ నాయుడు బిజెపి నాయకులను అరెస్టు చేశారని ఆయన పేర్కొన్నారు. అరెస్టయిమ వారిలో బిజెవైఎం నాయకులు పార్థసారథి, సుబ్రమణ్యం, నరేష్, బావాజి, గజేంద్ర, సర్దార్ తదితరులు ఉన్నారు. అనంతరం పోలీసులు వారిని వారి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.

Tags: Kallur Birthplace, which became Rasabasa – our village program

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *