Kalti Madhi to Telangana from Karnataka

కర్ణాటక నుంచి తెలంగాణకు కల్తీ మద్యం

Date: 03/01/2018

మెదక్ ముచ్చట్లు:

తెలంగాణ, కర్ణాటక రాష్ట్ర సరిహద్దుల్లో అక్రమ మద్యం దందా జోరుగా సాగుతోంది. కర్ణాటకలో తక్కువ ధరకు వచ్చే మద్యాన్ని మెదక్‌ జిల్లా నారాయణఖేడ్‌ నియోజకవర్గం మనూరు, కంగ్టి మండలాల సరిహద్దుల నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి తరలిస్తున్నారు. చీప్‌గా వస్తోందని నాసిరకం మద్యాన్ని సేవించి మద్యం ప్రియులు ఆరోగ్యాలు గుల్ల చేసుకుంటున్నారు. మరికొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. టూ వీలర్లు, ఆటోల మీద విచ్చలవిడిగా మద్యాన్ని చెక్‌పోస్టులు దాటిస్తున్నారు. చీప్‌గా వచ్చే మద్యంతో పాటు కల్తీ మద్యాన్ని కర్ణాటక నుంచి తరలిస్తున్నారు. ఇయర్‌ ఎండింగ్‌ డిసెంబర్‌ 31కోసం భారీ ఎత్తున కల్తీ మద్యాన్ని మెదక్‌ జిల్లాకు తరలించారు. తక్కువ ధరతో ఎక్కువ కిక్కు వస్తుంది అంటూ కల్తీ మద్యాన్ని సేవించి ఆసుపత్రుల పాలవుతున్నారు. ఇదంతా బహిరంగంగా కళ్లెదుటే జరుగుతున్నా ఎక్సయిజ్‌ అధికారులు కర్ణాటక నుంచి జరుగుతున్నా అక్రమ మద్యం తరలింపు అడ్డుకోకపోతుండడంతో వారి తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారులు కల్పించుకుని తగు చర్యలు తీసుకోకపోతే డిసెంబరు 31న కల్తీ మద్యం సేవించి పెద్ద సంఖ్యలో మద్యం ప్రియులు ప్రాణాలమీదకు తెచ్చుకుంటారని స్థానికులు చెబుతున్నారు. అనర్థం జరగకముందే అధికారులు కళ్లు తెరవాలంటున్నారు.

Tags: Kalti Madhi to Telangana from Karnataka

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *