నాలుగు లైన్ల రహదారిగా కల్వకుర్తి-హైదరాబాద్ రోడ్డు

హైదరాబాద్ ముచ్చట్లు:
 
కల్వకుర్తి-హైదరాబాద్ జాతీయ రహదారి,కల్వకుర్తి, కొల్లాపూర్ వయా సోమశిల మీదుగా నంద్యాల రహదారి పై కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ శాసనసభలో అడిగిన ప్రశ్నకు రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ
మంత్రి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమాధానమిచ్చారు.కల్వకుర్తి హైదరాబాద్ జాతీయ రహదారి ని మూడు లైన్ల నుండి నాలుగు లైన్లుగా విస్తరించడానికి డిపిఆర్ నియమకానికై NHAI ప్రధాన కార్యాలయానికి హైదరాబాద్ రీజనల్ NHAI అధికారిప్రతిపాదనలు పంపారని తెలిపారు. సోమశిల మీదుగా కల్వకుర్తి నంద్యాల జాతీయ రహదారి మంజూరి అయ్యిందన్నారు. దానికోసం 2013 ఆర్ఎఫ్ సిటీఎల్ ఏ & ఆర్ ఆర్ చట్టానికి అనుగుణంగా 1956జాతీయ రహదారుల చట్టం ప్రకారం భూసేకరణకు సమర్థ అధికారి ని 2-07-2022 తేదీన నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ నియమించారని తెలిపారు.భూ ప్రణాళిక షెడ్యూల్ ల రూపకల్పన ప్రక్రియలోఉన్నదన్నారు.
 
Tags: Kalvakurthi-Hyderabad road as a four lane road

Natyam ad