కమల్ కౌగలింతతో 4 రోజులు స్నానానికి దూరం!

హైదరాబాద్‌ ముచ్చట్లు:

విలక్షణ నటుడు కమలహాసన్ అంటే ఇష్టపడని వారు ఉండరు. అయితే కమల్ కౌగలించుకున్నాడని ఏకంగా 4 రోజులు స్నానానికి దూరం అయిన ఒక టాప్ హీరో అనుభవం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆశక్తికరమైన ఈవార్తల వివరాలలోకి వెళితే ఇటువంటి అనుభవాన్ని పొందిన కన్నడ టాప్ హీరో శివ రాజ్‌కుమార్ చెప్పిన మాటలు ఇప్పుడు మీడియాకు హాట్ టాపిక్‌గా మారాయి. రామ్‌గోపాల్ వర్మ తీసిన ‘కిల్లింగ్ వీరప్పన్’ మూవీ ఆడియో లాంచ్‌లో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ఈ మాటలు చెప్పాడు. కర్ణాటక చలన చిత్ర అకాడమీ బెంగుళూరులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈ కన్నడ టాప్ హీరో కమలహాసన్‌పై తనకున్న అభిమానాన్ని వ్యక్త పరుస్తూ ఈవిషయాలు చెప్పాడు. తన తండ్రి రాజ్‌కుమార్ అడుగు జాడల్లోనే తాను కెరియర్‌లో ముందుకు వెళుతున్న విషయాన్ని చెపుతూ తాను ఎప్పుడూ ఒక స్టార్ కొడుకులా కాకుండా ఒక సామాన్యుడుగానే పెరిగాను అన్న విషయాన్ని చెప్పాడు. ఇదే సందర్భంలో కమల్ గురించి మాట్లాడుతూ ఒకసారి కమల్ తనను ఒక సందర్భంలో కౌగలించుకున్న విషయాన్ని గుర్తుకు చేసుకుంటూ కమల్ తనను కౌగలించుకున్న సందర్భంలో అనుకోని ఆనందాన్ని తాను పొందడంతో కమల్ తనను హత్తుకున్న పరిమిళం వీడిపోవడం ఇష్టంలేక నాలుగు రోజులు స్నానం చేయలేదు అంటూ ఒక యదార్ధ విషయాన్ని బయటపెట్టి అందరికీ షాక్ ఇచ్చాడు ఈ కన్నడ హీరో. ఇక ఈ వార్తలు ఇలా ఉండగా అన్ని అడ్డంకులు తొలిగిపోవడంతో ఈ వారం 4వ తేదీన రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ‘కిల్లింగ్ వీరప్పన్’ తెలుగు కన్నడ తమిళ భాషలలో ఒకేసారి విడుదల కాబోతోంది. అయితే ఈ మధ్య కాలంలో వర్మ సినిమాలు అన్నీ ఘోరమైన ఫ్లాపులుగా మారడంతో ఈ సినిమా కూడా అదే లిస్టులో చేరిపోతుందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

 

Tag : Kamal Kugalindai 4 days a bath


 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *