సరస్వతీ దేవి అలంకారంలో కనకదుర్గ

విజయవాడ ముచ్చట్లు:
 
శ్రీపంచమి సందర్భంగా సరస్వతీ దేవి అలంకారం లో కనకదుర్గ అమ్మవారు  దర్శనమిచ్చారు.శ్రీ పంచమి సంధర్భంగా చిన్నారాజ గోపురం వద్ద ఉన్న గోశాల వద్ద అమ్మవారి విగ్రహం వద్ద ఆలయ వైదిక కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అమ్మవారికి పూజలు నిర్వహించి, సరస్వతీ హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్  పైలా సోమినాయుడు దంపతులు, రు, కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ,  పాలకమండలి సభ్యులు  కటకం శ్రీదేవి,  ఎన్. సుజాత,  ఎన్. రాజ్యలక్ష్మి, ఆలయ అధికారులు,  భక్తులు పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. శ్రీ అమ్మవారి సన్నిధిలో  అక్షరాభ్యాసం లోచిన్నారులు,  విద్యార్థులు పాల్గోన్నారు. శ్రీ సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారిని మాస్కులు ధరించి, అమ్మవారి నామస్మరణ చేస్తూ దర్శించుకున్నారు. శ్రీ అమ్మవారి ప్రసాదంగా పెన్ను, అమ్మవారి ఫోటో, కంకణం మరియు లడ్డు  ప్రసాదంను ఉచితముగా పంపిణీ చేసారు.
 
Tags; Kanakadurga in the decoration of Saraswati Devi

Natyam ad